BIKKI NEWS (AUG. 27) : Kamareddy floods today. కామారెడ్డిలోని రాజంపేట గ్రామంలో గత 20 గంటల్లో 500మి.మి వర్షపాతం నమోదైంది. గంట గంటకూ అక్కడ వాతావరణం భయంకరంగా మారుతోంది.
Kamareddy floods today.
అర్ధరాత్రి 12 గంటల నుండి ఈరోజు ఉదయం 8 గంటల వరకు 136 మి.మీ వర్షం కురవగా, ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు 363 మి.మీ
మెదక్‌లోని కామారెడ్డిలో మరో 3-4 గంటల పాటు తీవ్ర వర్షాలు కురుస్తాయని దాంతో 550-600mm వర్షపాతం దాటే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం.
తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో చేపడుతున్న సహాయ, పునరావాస కార్యక్రమాలపై గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు పోలీస్ కమిషనర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న రాష్ట్ర రెవిన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
వర్షాలు కురిసే జిల్లాలకు ప్రత్యేకాధికారులుగా సీనియర్ ఐఏ.ఎస్ అధికారుల నియామకం చేశారు. మెదక్ జిల్లాకు ప్రత్యేకాధికారిగా జెన్కో ఎండీ హరీష్ నియామకం . హైదరాబాద్ నుండి ఏవిధమైన సహకారం కావాలంటే, అందిస్తామని స్పష్టం చేశారు.
ఏవిధమైన ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఏదైనా ప్రాజెక్టు, చెరువులు మత్తడి పోస్తే జాగ్రత్తలు చేపట్టాలని తెలిపారు.
సచివాలయంలో 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని, ప్రజలకు ఏవిధమైన అసౌకర్యం కలుగ కుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు .