Regularization - కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణలో హైకోర్టు ఆదేశాలు పాటించండి - bikki news

REGULARIZATION – కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణలో హైకోర్టు ఆదేశాలు పాటించండి

BIKKI NEWS (NOV. 12) : AP Contract lecturers demanding for Regularization as for high court orders. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు డిగ్రీ కళాశాలలు పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ క్రమబద్ధీకరణను హైకోర్టు ఆదేశానుసారం 8 వారాల్లో పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వ కళాశాల కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం విజ్ఞప్తి చేసింది.

AP Contract lecturers demanding for Regularization as for high court orders.

జగన్ ప్రభుత్వ హయాంలో 2023 అక్టోబర్ 23 విడుదలైన తమ రెగ్యులరైజేషన్ జీవోను అమలు చేయాలని ఈ సందర్భంగా వారు విన్నవించారు.

జీవో విడుదలైన తర్వాత ఎన్నికల కోడ్ అమలు కావడంతో తమ క్రమబద్ధీకరణ ప్రక్రియ నిలిచిపోయిందని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు.

గత 18 నెలలుగా ప్రభుత్వానికి ఎన్ని రూపాలలో విన్నపాలు చేసిన పట్టించుకోవడంలేదని తాజా హైకోర్టు కూడా తమకు అనుకూలంగా తీర్పునిచ్చిందని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు.

తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ పై నాలుగు వారాలులోగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని గడువు నిర్దేశించిన సంగతి తెలిసిందే.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →