BIKKI NEWS (AUG. 30) : supreme court issued notices on ST status to Lambadis and Banjaras. లంబాడీలు, బంజారాలు, సుగాలి కులాలకు ఎస్టీ హోదా కల్పించడంపై సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై తదుపరి విచారణకు వచ్చే సరికి పూర్తి సమాచారాన్ని తమ ముందు ఉండాలని ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది.
supreme court issued notices on ST status to Lambadis and Banjaras
లంబాడా, సుగాలీలు గిరిజనులు కాదని, 1976 వరకు ఉమ్మడి ఏపీలోని తెలంగాణ జిల్లాల్లో వారిని ఎస్టీలుగా పరిగణించలేదని, ఇతర రాష్ట్రాల నుంచి వారు తెలంగాణకు వలస వచ్చి ఇక్కడి అసలైన గిరిజనుల హక్కులను కొల్లగొట్టారని పిటిషన్ లో ఆరోపించారు. అంతకు ముందు వారు బీసీ జాబితాలో ఉన్నారని గుర్తు చేశారు.
హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్ లో విలీనమైన సందర్భంలో ఆంధ్రా ప్రాంతం మద్రాసు రాష్ట్రంలో ఉందని, ఆ సమయంలో లంబాడా, సుగాలీలను ఏపీ ప్రాంతం లో ఎస్టీలుగా గుర్తించారని తెలిపారు. కానీ హైదరాబాద్ స్టేట్ లో కాదని తెలిపారు. అనంతర కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ మూడు వర్గాలను ఎస్టీ జాబితాలో చేర్చిందని వివరించారు.
ఇప్పుడు మళ్లీ తెలంగాణ, ఏపీలు రెండు రాష్ట్రాలుగా విడిపోయినందున తెలంగాణలోని బంజారా, లంబాడా, సుగాలీలను తిరిగి బీసీ జాబితాలో చేర్చేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్ లో అభ్యర్ధించారు.
ఈ మూడు కులాలను ఎస్టీ జాబితాలో చోటు కల్పించడంపై శుక్రవారం జస్టిస్ జె.కె.మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.
లంబాడా, సుగాలీ, బంజారాలను ఎస్టీ జాబితాలో చేర్చడం ఆర్టికల్ 342కు వ్యతిరేకమని, ఈ వర్గాలు విద్యా, ఆర్థిక రంగాల్లో ఎస్టీ జాబితాలోని ఇతర వర్గాలకంటే అభివృద్ధి చెండాయని దీంతో నిజమైన ఆదివాసీలకు అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు.
ఈ మూడు వర్గాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని కోరుతూ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, మాజీ ఎంపీ సోయం బాపూరావు. మరికొందరు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
- Inter Supplementary Short Memos 2026 – ఇంటర్ ఫలితాలు, షార్ట్ మెమో ల కోసం క్లిక్ చేయండి
- Inter RV RC 2026 – ఇంటర్ సప్లిమెంటరీ రీ కౌంటింగ్ రీ వెరిఫికేషన్ అవకాశం
- Inter Supplementary exams Results 2026 – ఇంటర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
- Today Gold Rate June 11th 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- Guest faculty జూనియర్ కళాశాలల్లో గెస్ట్ అధ్యాపకులను వెంటనే నియమించాలి – TIGLA

