Dasara Holidays 2026 – స్కూల్స్, కళాశాలలకు దసరా సెలవుల తేదీలు ఇవే

Dasara holidays 2026 - స్కూల్స్, కళాశాలలకు దసరా సెలవుల తేదీలు ఇవే

BIKKI NEWS (Sep. 24) : Dasara holidays 2026 for schools and colleges. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు అక్టోబరు 10 నుంచి 22వ తేదీ వరకు… మొత్తంగా 13 రోజులపాటు దసరా సెలవులు ఇవ్వనున్నారు. అకడమిక్‌ విద్యా క్యాలెండర్‌ ప్రకారమే ఈ సెలవులు ఉంటాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

Dasara holidays 2026 for schools and colleges

అక్టోబరు 10న రెండో శనివారం… 11, 18 తేదీలు ఆదివారమైనందున వాటిని పక్కనబెడితే నికరంగా పది రోజులే సెలవులని తెలిపారు.

దసరా సెలవుల దృష్ట్యా సమ్మెటివ్‌ ఎసెస్‌మెంట్‌ (ఎస్‌ఏ-1) పరీక్షలు అక్టోబరు 1న ప్రారంభించి..9వ తేదీతో పూర్తిచేయాలని తాజాగా ఎస్‌సీఈఆర్‌టీ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది.

జూనియర్ కళాశాలలకు దసరా సెలవులు

అలాగే జూనియర్ కళాశాలలకు దసరా సెలవులు అక్టోబర్ 10 నుండి 21 వ తేదీ వరకు ఉండనున్నాయి. అకడమిక్ కేలండర్ ప్రకారం అక్టోబర్ 22 న కళాశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 3 నుంచి 9 వరకు అర్ధ వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →