BIKKI NEWS : Today current affairs in Telugu 13th November 2026 – కరెంట్ అఫైర్స్
Today current affairs in Telugu 13th November 2026
1)మానవ సంబంధాలలో దయ, సానుభూతి మరియు సద్భావనను పెంపొందించేందుకు ప్రతి ఏటా నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే అంతర్జాతీయ దినోత్సవం ఏది?
జ : ప్రపంచ దయ దినోత్సవం (World Kindness Day)
2)కేంద్ర మంత్రివర్గం ₹4,111 కోట్ల బడ్జెట్‌తో ఏ పథకాన్ని 2031 మార్చి 31 వరకు పొడిగిస్తూ ఆమోదం తెలిపింది?
జ : స్టాండ్-అప్ ఇండియా పథకం (Stand-Up India Scheme)
3)ప్రధానమంత్రి ముద్ర యోజన (PMMY) కింద సూక్ష్మ సంస్థలకు పూచీకత్తు లేని రుణాలను ప్రోత్సహించేందుకు ‘క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ఫర్ మైక్రో యూనిట్స్’ (CGFMU) పథకాన్ని ₹5,000 కోట్ల కార్పస్‌తో ఏ తేదీ వరకు కొనసాగించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది?
జ : 2031 మార్చి 31 వరకు (రూ. 12.6 లక్షల కోట్ల రుణాల కల్పన లక్ష్యం)
4)దేశీయంగా వైద్య పరికరాల తయారీని ప్రోత్సహించే ‘ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఫర్ మెడికల్ డివైసెస్’ (PLI-MD) పథకాన్ని ₹2,700 కోట్ల వ్యయంతో ఏ ఆర్థిక సంవత్సరం వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది?
జ : ఆర్థిక సంవత్సరం 2035–36 (FY36) వరకు
5)2026–27 రబీ సీజన్‌కు గాను ఫాస్ఫేటిక్ మరియు పొటాసిక్ (P&K) ఎరువులపై న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ (NBS) రేట్ల కోసం కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన మొత్తం బడ్జెట్ ఎంత?
జ : ₹62,370.02 కోట్లు
6)అంతర్జాతీయ తీర ప్రాంత పర్యావరణ ప్రమాణాలకు గుర్తింపుగా 2026–27 సంవత్సరానికి ‘ఇంటర్నేషనల్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్’ (Blue Flag Certification) పొందిన మహారాష్ట్రలోని బీచ్‌ల సంఖ్య ఎంత?
జ : మూడు బీచ్‌లు
7)ఫిఫా ప్లేయర్ ఇంపాక్ట్ ప్రోగ్రామ్ 2026 (FIFA Player Impact Programme 2026)లో ఎంపికైన మొట్టమొదటి పురుష ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా నిలిచిన భారత దిగ్గజ ఆటగాడు ఎవరు?
జ : సునీల్ ఛెత్రీ (Sunil Chhetri)
8)భారత నావికాదళం దేశవ్యాప్తంగా సమన్వయం చేస్తున్న 5వ ఎడిషన్ తీర రక్షణ విన్యాసం పేరేమిటి?
జ : సీ విజిలెన్స్-26 (Exercise Sea Vigil-26)
9)భారత నావికాదళానికి చెందిన ‘ఐఎన్ఎస్ బెట్వా’ (INS Betwa) యుద్ధనౌక నార్మల్ రిఫిట్ మరియు రీ-పవరింగ్ కోసం రక్షణ మంత్రిత్వ శాఖ ₹498.58 కోట్ల ఒప్పందాన్ని ఏ సంస్థతో కుదుర్చుకుంది?
జ : కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (CSL)
Today current affairs in Telugu 13th November 2026
10)జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ZSI) మరియు ఐసీఏఆర్-సీఎంఎఫ్ఆర్ఐ (ICAR-CMFRI) శాస్త్రవేత్తలు హిందూ మహాసముద్రంలో గుర్తించిన సరికొత్త లోతైన సముద్రపు సొరచేప (Deep-sea Shark) జాతి శాస్త్రీయ నామం ఏమిటి?
జ : ఎకినోర్హినస్ రోయినీ (Echinorhinus roinee – ఇండియన్ బ్రాంబుల్ షార్క్)
11)23వ ఆసియాన్- ఇండియా సమ్మిట్ (23rd ASEAN-India Summit) మరియు 21వ తూర్పు ఆసియా సదస్సు (21st East Asia Summit)లలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఏ నగరాన్ని సందర్శించనున్నారు?
జ : మనీలా (ఫిలిప్పీన్స్)
12)భారతదేశంలో మొట్టమొదటి ‘స్టీల్ స్క్రాప్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్’ (Steel Scrap Futures Contract)ను ప్రారంభించేందుకు బిగ్‌మింట్ (BigMint) సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకున్న ఎక్స్ఛేంజ్ ఏది?
జ : ఎన్సీడీఈఎక్స్ (NCDEX)
13)టాటా గ్రూప్ రిటైర్మెంట్ నిబంధనల ప్రకారం నోయెల్ టాటా పదవీ విరమణ చేయడంతో, టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ నూతన ఛైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
జ : బహ్రామ్ వకీల్ (Bahram Vakil)
14)మొట్టమొదటి బిమ్‌స్టెక్ (BIMSTEC) ఆరోగ్య మంత్రుల సమావేశం ఇటీవల ఏ నగరంలో జరిగింది?
జ : కొలంబో (శ్రీలంక)
15)ఇటీవల 85 ఏళ్ల వయసులో కన్నుమూసిన ప్రముఖ అమెరికన్ నోబెల్ బహుమతి గ్రహీత మరియు వాతావరణ ఆర్థికవేత్త ఎవరు?
జ : విలియం డాబ్నీ నార్డ్‌హాస్ (William Dawbney Nordhaus)
16)2027–28 విద్యా సంవత్సరం నుండి ప్రత్యేక ఇంటర్మీడియట్ కళాశాలలను రద్దు చేసి, 11 మరియు 12 తరగతులను సాధారణ పాఠశాల విద్యా వ్యవస్థ పరిధిలోకి తీసుకురానున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి ఎవరు?
జ : ఏ. రేవంత్ రెడ్డి (తెలంగాణ ముఖ్యమంత్రి)
17)కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఇటీవల జాతీయ ప్రాముఖ్యత కలిగిన పురావస్తు ప్రదేశంగా (Site of National Importance) ప్రకటించిన ‘రాణివాస్ మౌండ్’ (Ranivas Mound) ఏ రాష్ట్రంలో ఉంది?
జ : బీహార్ (తూర్పు చంపారన్ జిల్లాలోని కేసరియా వద్ద)
18)సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) లావాదేవీలను సులభతరం చేసేందుకు ‘ఐఓబీ డిజిటల్ రూపీ’ (IOB Digital Rupee) మొబైల్ యాప్‌ను ప్రారంభించిన ప్రభుత్వ రంగ బ్యాంకు ఏది?
జ : ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB)
19)2026–27 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జీడీపీ వృద్ధి అంచనాను 7 శాతానికి పెంచుతూ నివేదిక విడుదల చేసిన అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఏది?
జ : మూడీస్ (Moody’s)

