BIKKI NEWS : Dasara Holidays prefix suffix rule. తెలంగాణలో పాఠశాలలకు అక్టోబర్ 10 నుంచి 22 వరకు జూనియర్ కళాశాలలకు 21 వరకు దసరా సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాఠశాలలకు మొత్తం 13 రోజులు, కళాశాలలకు మొత్తం 12 రోజులు చొప్పున సెలవులు ఉండనున్నాయి.
Dasara Holidays prefix suffix rule
అయితే అమలులో ఉన్న సెలవుల నిబంధనల ప్రకారం 14 రోజులకు మించని సెలవుల విషయంలో prefix మరియు suffix రెండు కూడా ఉపాధ్యాయులు, లెక్చరర్ లు విధులకు హాజరు కావాల్సి ఉంటుంది.
తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలకు దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 10 నుంచి 22వ తేదీ వరకు మొత్తం 13 రోజులపాటు సెలవులు ప్రకటించారు. అనగా సెలవులకు ముందు రోజు, అంటే అక్టోబర్ 9న, అలాగే సెలవులు ముగిసిన అనంతరం మొదటి పని దినమైన కళాశాలలకు అక్టోబర్ 22, పాఠశాలలకు 23న తప్పనిసరిగా విధులకు హాజరు కావాల్సి ఉంటుంది.
ఉపాధ్యాయులు, లెక్చరర్ లు అక్టోబర్ 9న లేదా అక్టోబర్ 22 , 23న విధులకు గైర్హాజరైతే సంబంధిత సెలవు నిబంధనల ప్రకారం మధ్యలో ఉన్న మొత్తం 13 రోజుల దసరా సెలవుల కాలాన్ని కూడా విధి గైర్హాజరుగా పరిగణించే అవకాశం ఉంటుందని అధికారులు సూచిస్తున్నారు.
Also Read…
• తాజా విద్యా సమాచారం
• తాజా జాబ్ నోటిఫికేషన్స్
• ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
• కరెంట్ అఫైర్స్
• జీకే బిట్స్
• ఎంప్లాయిస్ న్యూస్
అందువల్ల ఉపాధ్యాయులు, అధ్యాపకులు సెలవులకు ముందు మరియు అనంతరం నిర్ణీత తేదీల్లో తప్పనిసరిగా పాఠశాలకు హాజరవ్వాలి .
సెలవులకు ముందు, అనంతరం విధులకు హాజరు విషయంలో నిబంధనలు తప్పక పాటించాలి.
అక్టోబర్ 9 న మధ్యాహ్నం పూట, 23న ఉదయం పూట సెలవులో ఉండరాదు.

