Today in history – చరిత్రలో ఈరోజు అక్టోబర్ 11

BIKKI NEWS : Today in history – చరిత్రలో ఈరోజు అక్టోబర్ 11

Today in history October 11th

దినోత్సవం

సంఘటనలు

1980: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 7వ ముఖ్యమంత్రిగా టంగుటూరి అంజయ్య ప్రమాణ స్వీకారం చేసాడు.
1988: జనతా దళ్ అనే ఒక కొత్త రాజకీయ పార్టీ ఏర్పడింది. విశ్వనాథ ప్రతాప్ సింగ్ దీనికి అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు.

జననాలు

1827: అఫ్జల్ ఉద్దౌలా, హైదరాబాదు పరిపాలకులలో ఐదవ నిజాం. ఇతడు 1857 నుండి 1869 వరకు పరిపాలించాడు. (మ.1869)
1902: జయప్రకాశ్‌ నారాయణ్, భారత్‌లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమాన్ని నిర్వహించిన వ్యక్తి. (మ.1979)
1920: మావేలికార కృష్ణన్ కుట్టి నాయర్, మృదంగ విద్వాంసుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. (మ.1988)
1922: సాలూరు రాజేశ్వరరావు,సంగీత దర్శకుడు (మ.1999)
1942: అమితాబ్ బచ్చన్, సినిమా నటుడు.
1947: వడ్డే రమేష్, తెలుగు సినీ నిర్మాత. (మ.2013)
1961: నిమ్మగడ్డ ప్రసాద్, ఫార్మా మాట్రిక్స్‌ ఫార్మా సంస్థ అధిపతి, వాన్‌పిక్‌ నిర్మాణ కాంట్రాక్టర్, వ్యాపారవేత్త.
1972: సంజయ్ బంగర్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
1978: క్రిష్: జాగర్లమూడి రాధాకృష్ణ , చలన చిత్ర దర్శకుడు

మరణాలు

1996: గిసేల బాన్, జర్మన్ పాత్రికేయురాలు. పద్మశ్రీ ఆవార్డు గ్రహీత. (జ.1909)
1997: గబ్బిట వెంకటరావు , సినీ, నాటక, రచయిత . పద్యకవి , నిర్మాత ,దర్శకుడు(జ.1928)
2015: మనోరమ, సుప్రసిద్ధ దక్షిణ భారత సినిమా నటీమణి. (జ.1937)
2020:రాజన్ ,(రాజన్ నాగేంద్ర సంగీత ద్వయం ) సం గీత దర్శకుడు,(జ.1933)

FOLLOW US :

@WHATSAPP | @TELEGRAM | @FACEBOOK