Today in history october 2nd – చరిత్రలో ఈరోజు అక్టోబర్ 02

Today in history

BIKKI NEWS : Today in history october 2nd- చరిత్రలో ఈరోజు అక్టోబర్ 02

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Today in history October 2nd

దినోత్సవం

  • గాంధీ జయంతి. (అంతర్జాతీయ అహింసా దినం, )
  • లాల్ బహదూర్ శాస్త్రి జయంతి.
  • అంతర్జాతీయ సత్యాగ్రహ దినోత్సవం.
  • ప్రపంచ సాధు జంతువుల రోజు.
  • మానవ హక్కుల పరిరక్షణ దినం .
  • గ్రామ స్వరాజ్ డే.
  • ఖైదీల దినోత్సవం.
  • జాతీయ ఖాదీ దినోత్సవం
  • దానోత్సవ వారం (జాయ్‌ ఆఫ్‌ గివింగ్‌) అక్టోబర్‌ 2 నుంచి 8వ తేదీ వరకు.
  • మాదకద్రవ్య వినిమయ వ్యతిరేక దినం

సంఘటనలు

1535: ఫ్రెంచ్ విశ్లేషకుడు జాక్యూస్ కార్టైర్ 1535 అక్టోబరు 2న హోచెలాగా (మాట్రియల్ చూడండి) ను సందర్శించాడు, హోచెలాగాలో నివాస ప్రజలు “వెయ్యి సంవత్సరాల కంటే ఎక్కువ కాలం” నుండి ఉంటున్నట్లు అంచనా వేశాడు.
1844: మద్రాసు ప్రెసిడెన్సీలోకెల్లా భారతీయుని యాజమాన్యంలో మొదటి పత్రిక క్రిసెంట్‌ను గాజుల లక్ష్మీనర్సు శెట్టి స్థాపించారు.
1845: భారతదేశంలో మొదటి షిప్పింగ్ కంపెనీ ప్రారంభమైంది
1934: భారత నావికాదళం ( అప్పటి పేరు రాయల్ ఇండియన్ నేవీ) స్థాపించబడింది.
1951: శ్యామ ప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘ్‌ను స్థాపించారు
1952: సంఘ ప్రెంపుదల కార్యక్రమం ప్రారంభమైంది.
1954: ఫ్రెంచ్ ఆధీనంలో ఉన్న చందర్‌నగర్ పశ్చిమ బెంగాల్‌లో భాగంగా మారింది
1955: చెన్నై లోని పెరంబూరులో ఉన్న సమగ్ర రైలు పెట్టెల కర్మాగారము (ICF) తన పనులు మొదలుపెట్టింది.
1961: బొంబాయిలో (నేటి ముంబై) షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పడింది.
1966: భారతదేశం లోని 16 రైల్వే జోన్‌లలో ఒకటైన దక్షిణ మధ్య రైల్వే ఏర్పడింది.
1971: అప్పటి రాష్ట్రపతి వి.వి.గిరి గాంధీ సదన్‌గా ఇప్పుడు మనకు తెలిసిన బిర్లా హౌస్‌ను దేశానికి అంకితం చేశారు . ఇక్కడే మహాత్మా గాంధీ హత్య జరిగింది.
1972: భారతదేశపు మొట్టమొదటి టెలివిజన్ స్టేషన్ బొంబాయిలో మొదలయ్యింది.
1985: వరకట్న నిషేధ సవరణ చట్టం అమలులోకి వచ్చింది
1988: సెప్టెంబర్ 17 నుంచి దక్షిణ కొరియాలోని సియోల్లో మొదలయిన 24వ ఒలింపిక్ క్రీడలు ముగిసాయి.
1988: తమిళనాడులోని మండపం ఇంకా పంబన్ నడుమ సముద్రంపై పొడవైన వంతెన తెరవబడింది.
1991: బీహార్ రాజధాని పాట్నా ఇంకా క్రొత్త ఢిల్లిల నడుమ శ్రమజీవి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ను మొదలుపెట్టారు
1992: ఒడిషా రాష్ట్రంలోని పట్టణం, మల్కనగిరి జిల్లా కేంద్రం. ఇది కొరాపుట్ జిల్లా నుండి వేరుచేయబడింది.
1994: 12వ ఆసియా క్రీడలు జపాన్ లోని హిరోషిమాలో ప్రారంభమయ్యాయి.
2004: అస్సాం, నాగాలాండ్ రాష్ట్రాలలో జరిగిన రెండు బాంబు ప్రేళుల్లలో 57 మంది ప్రజలు మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు.
2006: అణు ఇంధన సరఫరా సమస్యపై భారత్‌కు మద్దతు ఇవ్వాలని దక్షిణాఫ్రికా నిర్ణయించింది.
2008: భారత్-అమెరికా అణుఒప్పందానికి అమెరికా సెనేట్ ఆమోదముద్ర వేసింది
2009: తుంగభద్ర నది ఉప్పొంగి కర్నూలు, మంత్రాలయం లతో సహా కర్నూలు, మహబూ నగర్ జిల్లాలలోని తుంగభద్ర తీరాన ఉన్న వందలాది గ్రామాలు నీటమునిగాయి.
2012: తెదేపా అధినేత చంద్రబాబు చేసిన ‘వస్తున్నా మీకోసం’ 208 రోజుల పాదయాత్ర మొదలుపెట్టారు.
2014: స్వచ్ఛ భారత్ లేదా స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమం మొదలయ్యింది.
2016: భారతదేశంలో విద్య విధానాలమీద సంస్కరణల కోసం దేశంలో వున్నా స్వచ్ఛంద సంస్థలను, యువతను భాగస్వామ్యం చేస్తూ దేశంలో యువత ద్వారా సంస్కరణల స్థాపనే ఏకైక లక్ష్యంగా ఉస్మానియా యూనివర్సిటీలో యూత్ పార్లమెంట్ ప్రోగ్రాం (వైపిపి) ఏర్పడింది

జననాలు

1852: విలియం రామ్సే, స్కాట్లాండుకు చెందిన రసాయన శాస్త్రవేత్త నోబెల్, బహుమతి గ్రహీత. (మ.1916)
1869: మహాత్మా గాంధీ, భారత జాతిపిత. (మ.1948)
1891: కోరాడ రామకృష్ణయ్య, భాషావేత్త, తెలుగు-సంస్కృత భాషా నిపుణులు. (మ.1962)
1902: అన్నాప్రగడ కామేశ్వరరావు, స్వాతంత్ర్య సమరయోధుడు (జ.1987).
1904: లాల్ బహాదుర్ శాస్త్రి, భారతదేశ రెండవ శాశ్వత ప్రధానమంత్రి. (మ.1966)
1908: పర్వతనేని బ్రహ్మయ్య, ఛార్టర్డ్ అకౌంటెంట్. (మ.1980)
1910: డి. అర్కసోమయాజి, ఆంధ్ర విద్యావేత్త
1911: అంబత్ మీనన్, కేరళ విద్యావేత్త
1911: జోస్యం జనార్దనశాస్త్రి, అభినవ వేమన బిరుదాంకితుడు, అష్టావధాని (మ.1997)
1923: ఎం.శాంతప్ప, రాయలసీమకు చెందిన విద్యావేత్త, మాజీ వైస్‌ఛాన్స్‌లర్ శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (మ.2017).
1924: తపన్ సిన్హా, ప్రముఖ సినీ దర్శకుడు (మ. 2009)
1926: నల్లా నరసింహులు, తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమకారుడు, సిపిఐ నాయకుడు. (మ. 1993)
1928: ఎస్.వి.జోగారావు, సాహిత్యవేత్త. (మ.1992)
1931: తాడూరి బాలాగౌడ్, భారత జాతీయ కాంగ్రేస్ నాయకుడు, నిజామాబాదు లోక్‌సభ నియోజకవర్గం సభ్యుడు. (మ.2010)
1935: ఎన్.నిత్యానంద్ భట్, చలనచిత్ర నిర్మాత
1942: ఆశా పరేఖ్, ప్రముఖ సినీ నటి
1943: కావూరు సాంబశివరావు, భారత పార్లమెంటు సభ్యుడు.
1943: మినతీ సేన్, భారత 12, 13, 14 లోక్ సభ సభ్యుడు.
1961: సోలిపేట రామలింగారెడ్డి, పాత్రికేయుడు, రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యే (మ.2020)
1974: రచనా బెనర్జీ, ఒరియా, బెంగాలీ, దక్షిణాది చిత్రాలనటీ.
1900 : అక్టోబర్ 2 లీలా రాయ్ జన్మించింది
1974: Veldi Indira అక్టోబర్ 2 జన్మించింది

మరణాలు

1422: ఫిరుజ్ షా బహమనీ.
1906: రాజా రవివర్మ, ప్రముఖ చిత్రకారుడు (జ. 1848)
1961: శ్రీరంగం నారాయణబాబు, తెలుగు కవి. (జ.1906)
1974: మద్దులపల్లి వేంకట సుబ్రహ్మణ్యశర్మ, కవి, పండితుడు, గ్రంథ ప్రచురణకర్త. (జ.1900)
1975: కుమారస్వామి కామరాజ్, తమిళనాడుకు చెందిన భారత రాజకీయనాయకుడు.
1982: సి.డి.దేశ్‌ముఖ్, భారత ఆర్థికవేత్త, దుర్గాబాయి దేశ్‌ముఖ్ భర్త. (జ.1896)
1992: హొన్నప్ప భాగవతార్, దక్షిణ భారత కర్ణాటక సంగీతకారుడు, నాటకరంగ ప్రముఖులు. (జ. 1915)
2018: ఎం.వి.వి.ఎస్. మూర్తి, విశాఖపట్నం లోని గీతం విద్యాసంస్థల వ్యవస్థాపకుడు అమెరికా లోని అలాస్కాలో మరణం (జ. 1938 జూలై 3).

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Also Read…

• తాజా విద్యా సమాచారం
• తాజా జాబ్ నోటిఫికేషన్స్
• ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
• కరెంట్ అఫైర్స్
• జీకే బిట్స్
• ఎంప్లాయిస్ న్యూస్

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →