Dasara Holidays for Gurukulas – ఆ కళాశాలలకు దసరా సెలవులు తగ్గింపు

Dasara holidays for gurukulas in telangana

BIKKI NEWS : Dasara Holidays for Gurukulas in Telangana. తెలంగాణలో ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన దసరా సెలవులకు, కొన్ని గురుకుల సొసైటీలు ప్రకటించిన సెలవులకు మధ్య వ్యత్యాసం కనిపిస్తోంది.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Dasara Holidays for Gurukulas in Telangana

ముఖ్యంగా బీసీ, మైనారిటీ గురుకులాల పరిధిలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE) కళాశాలలకు సెలవులు తగ్గించడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బతుకమ్మ, దసరా వంటి ప్రధాన పండుగల సమయంలోనూ సెలవులు పరిమితంగా ఉండటంపై ఆవేదన వ్యక్తమవుతోంది.

ఇంటర్ బోర్డు ప్రకటించిన దసరా సెలవులు ఇవే

2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డు గతంలోనే విద్యా క్యాలెండర్‌ను ప్రకటించింది. దాని ప్రకారం అక్టోబర్ 10 నుంచి 21 వరకు దసరా సెలవులు ఇవ్వగా, అక్టోబర్ 22న కళాశాలలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. సాధారణ ఇంటర్మీడియట్ కళాశాలలతో పాటు ఎస్సీ, ఎస్టీ, జనరల్ గురుకుల సొసైటీలు కూడా బోర్డు సెలవుల షెడ్యూల్‌ను అనుసరిస్తున్నాయి.

మైనారిటీ గురుకులాలకు ఐదు రోజులే సెలవులు

మైనారిటీ గురుకుల సొసైటీ పరిధిలోని కళాశాలలకు మొత్తం 18 సెలవులు ఉండగా, ఈ నెల 17 నుంచి 21 వరకు కేవలం ఐదు రోజులు మాత్రమే దసరా సెలవులు ప్రకటించినట్లు సమాచారం. దీంతో ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన సెలవులతో పోలిస్తే గురుకుల విద్యార్థులకు సెలవుల విషయంలో తేడా ఏర్పడింది.

బీసీ గురుకులాలకు కేవలం రెండ్రోజులే

బీసీ గురుకుల సొసైటీ పరిధిలోని కళాశాలలకు మొత్తం 24 సెలవులు ఉండగా, అక్టోబర్ 20, 21 తేదీల్లో కేవలం రెండు రోజులు మాత్రమే సెలవులు ప్రకటించినట్లు సమాచారం . బీసీ, మైనారిటీ గురుకులాల పరిధిలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కళాశాలలను యథావిధిగా నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

విద్యార్థులు, తల్లిదండ్రుల్లో అసంతృప్తి

తెలంగాణలో బతుకమ్మ, దసరా ప్రధాన పండుగలు కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి పండుగలు జరుపుకోవాలని విద్యార్థులు ఎదురుచూస్తుంటారు. అయితే, కొన్ని గురుకులాల్లో పరిమిత సెలవులే ప్రకటించడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. బోధనా సిబ్బంది సైతం ఉన్నతాధికారుల నిర్ణయాలపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .

ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన సెలవుల షెడ్యూల్‌ను అన్ని గురుకుల సొసైటీలు ఒకే విధంగా అమలు చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో బీసీ, మైనారిటీ గురుకులాల సెలవులపై అధికారులు స్పష్టత ఇవ్వాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →