హైదరాబాద్(జూన్ 01) : TG SSC Supplementary Time Table 2026. తెలంగాణలో పదో తరగతి (SSC) అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన కీలక అప్‌డేట్ వచ్చేసింది. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSE తెలంగాణ) జూన్-2026 లో నిర్వహించబోయే టెన్త్ క్లాస్ సప్లిమెంటరీ పరీక్షల అధికారిక టైమ్ టేబుల్‌ను విడుదల చేసింది.
TG SSC Supplementary Time Table 2026
పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 09:30 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు (కొన్ని పేపర్లకు మినహాయింపుతో) జరుగుతాయి.
| తేదీ & రోజు | సబ్జెక్ట్ (Subject & Paper Code) | సమయం (Timings) |
|---|---|---|
| 05.06.2026 (శుక్రవారం) | ఫస్ట్ లాంగ్వేజ్ (Group-A) / ఫస్ట్ లాంగ్వేజ్ పార్ట్-1 & 2 | 09:30 AM to 12:30 PM / 12:50 PM |
| 06.06.2026 (శనివారం) | సెకండ్ లాంగ్వేజ్ (Second Language) | 09:30 AM to 12:30 PM |
| 07.06.2026 (ఆదివారం) | థర్డ్ లాంగ్వేజ్ – ఇంగ్లీష్ (English) | 09:30 AM to 12:30 PM |
| 08.06.2026 (సోమవారం) | మ్యాథమెటిక్స్ (Mathematics) | 09:30 AM to 12:30 PM |
| 09.06.2026 (మంగళవారం) | సైన్స్ పార్ట్-1 (Physical Science) | 09:30 AM to 11:00 AM |
| 10.06.2026 (బుధవారం) | సైన్స్ – పార్ట్-2 (Biological Science) | 09:30 AM to 11:00 AM |
| 11.06.2026 (గురువారం) | సోషల్ స్టడీస్ (Social Studies) / OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1 | 09:30 AM to 12:30 PM |
| 12.06.2026 (శుక్రవారం) | OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2 (సంస్కృతం & అరబిక్) | 09:30 AM to 12:30 PM |
విద్యార్థులు గమనించాల్సిన ముఖ్యమైన నిబంధనలు (Exam Rules):
అధికారిక నోటిఫికేషన్ ప్రకారంగా విద్యార్థులు కింది నియమాలను తప్పకుండా పాటించాలి:
- పార్ట్-బి (Objective Paper) సమయం: ఇంగ్లీష్, సైన్స్ మినహా మిగిలిన అన్ని సబ్జెక్టులకు పరీక్ష చివరి 30 నిమిషాలలో ఆబ్జెక్టివ్ పేపర్‌కు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఫిజికల్ సైన్స్ మరియు బయోలాజికల్ సైన్స్ పరీక్షలకు చివరి 15 నిమిషాల సమయం కేటాయించారు. ఇంగ్లీష్ సబ్జెక్టుకు మాత్రం పార్ట్-ఏ తో కలిపి రాయాల్సి ఉంటుంది.
- ప్రభుత్వ సెలవులు వర్తించవు: పరీక్షల సమయంలో ప్రభుత్వం ఏదైనా సాధారణ లేదా పబ్లిక్ హాలిడే ప్రకటించినప్పటికీ, పైన పేర్కొన్న టైమ్ టేబుల్ ప్రకారమే పరీక్షలు యథావిధిగా జరుగుతాయి.
- హాట్ టికెట్ మరియు సెంటర్ జాగ్రత్త: విద్యార్థులు తమకు కేటాయించిన పరీక్షా కేంద్రానికి (Exam Centre) మాత్రమే హాజరుకావాలి. వేరే సెంటర్‌కు వెళ్తే పరీక్ష రద్దు చేయబడుతుంది. అలాగే హాల్ టికెట్‌లో ముద్రించిన సరైన క్వశ్చన్ పేపర్ కోడ్‌ను మాత్రమే చూసి రాయాలి.
