Cm revanth reddy on intermediate merger in school education

Intermediate merging – విద్యా విలీనమే – ఉద్యోగుల విలీనం కాదు – సీఎం రేవంత్ రెడ్డి

BIKKI NEWS (Sep. 05) : CM Revanth Reddy on Intermediate merging in school education. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సీఎం తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్ విలీనంపై కీలక విషయాలను వెల్లడించారు.

CM Revanth Reddy on Intermediate merger in school education

జాతీయ నూతన విద్యా విధానం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కూడా నూతన ఎడ్యుకేషన్ పాలసీని రూపొందించి అందుకు అనుగుణంగా ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేస్తున్నట్లు తెలిపారు.

అయితే ఇది కేవలం విద్యా వీలీనమే గాని ఉద్యోగుల విలీనం కాదని ఇంటర్మీడియట్ విద్యలో పనిచేస్తున్న ఉద్యోగుల సర్వీస్ కు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు.

ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యలో కలపడం కేవలం విద్యా విలీనం మాత్రమేనని, జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకుల సర్వీస్ కు సంబంధించి ఎలాంటి విలీనం జరగదని, వారికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

ఉద్యోగులకు ఈ అంశంపై ఏమైనా సందేహాలు, సమస్యలు, సూచనలు ఉంటే కే. కేశవరావు దృష్టికి తీసుకురావాలని సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తామని స్పష్టం చేశారు.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →