Standard gk bits part 170 - జీకే బిట్స్ - bikki news

Standard GK bits part 170 – జీకే బిట్స్

BIKKI NEWS : Standard GK bits part 170 – జీకే బిట్స్

Standard GK bits part 170

1) గ్రేటర్ మెండల్ పరిశోధన చేసిన మొక్క పేరు ఏమిటి.?
జ : బఠాని

2) భారత రాజ్యాంగ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : నవంబర్ 26

3) భారతదేశ మొదటిసారిగా ఉపయోగించిన ఉపగ్రహం ఏమిటి.?
జ : ఆర్యభట్ట

4) ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఏకైక ఎలిఫెంట్ ప్రాజెక్టు ఏది.?
జ : కౌండిన్య

5) భారత రాజ్యాంగంలో ఏ షెడ్యూల్లో పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం ఉంది.?
జ : పదవ షెడ్యూల్

6) రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రతి వ్యక్తికి మాతృభాషలో విద్య బోధన జరగడానికి కావలసిన ఏర్పాట్లు చేయాలని సూచిస్తుంది.?
జ : 350 (ఏ)

7) అండమాన్ నికోబార్ దీవులు ఏ హైకోర్టు న్యాయ పరిధిలోకి వస్తాయి.?
జ : కోల్ కతా

8) 1946లో తాత్కాలిక మంత్రి వర్గం ఎవరి నాయకత్వంలో ఏర్పడింది .?
జ : జవహర్ లాల్ నెహ్రూ

9) భారత ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని ఎక్కడ ప్రవేశపెట్టాలి.?
జ : రాజ్యసభలో మాత్రమే

10) ప్రపంచ వలస పక్షుల దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు.?
జ : మే 10

11) అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు.?
జ : మే

13) భారతదేశంలో అతిపెద్ద ఐస్ క్రీమ్ తయారీ ఉంది.?
జ : హైదరాబాద్ (హాట్సన్ ఆగ్రో ప్రొడక్ట్స్)

14) భారతదేశ స్వతంత్ర అనంతరం జన్మించి రాష్ట్రపతి అయిన ఒకే ఒక అభ్యర్థి ఎవరు.?
జ : ద్రౌపది ముర్ము

15) కొన్ని ప్రాథమిక హక్కులను నిలుపుదల చేయడానికి రాజ్యాంగం లో నిర్దేశించబడిన ఆర్టికల్ ఏది.?
జ : ఆర్టికల్ 359

16) “చట్టం నిర్దేశించిన పద్ధతి” అనే పదం రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ లో ఉంది.?
జ : ఆర్టికల్ 22(సి)

17) 1960 లో హరిత విప్లవానికి ఏమని పేరు .?
జ : నూతన వ్యవసాయక వ్యూహం

18) జాతీయ సాక్షరత మిషన్, ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనే కార్యక్రమాలు ఏ విద్యా విధానంలోనివి .?
జ : జాతీయ విద్యా విధానం 1986

19) పంచాయతీ రాజ్ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ.: ఏప్రిల్ 24

20) సంసద్ ఆదర్శ గ్రామ యోజన పథకం కింద ఎవరు ఆదర్శ గ్రామాన్ని గుర్తిస్తారు.?
జ : లోక్ సభ సభ్యుడు

21) తెలంగాణ రాష్ట్ర పథకం ఆయిన టీ ప్రైడ్ యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి.?
జ : ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం

22) జన జాత గౌరవ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : నవంబర్ 15

23) ఎరి‌, ముగ, టసర్ పదాలు వేటిని సూచిస్తాయి.?
జ : పట్టు వస్త్రాలు

24) వీర శైవ ఉద్యమానికి నాయకుడు ఎవరు.?
జ : బసవ

25) పంచ సిద్దాంతిక రచన ఎవరిది.?
జ : వరహ మిహిరుడు

26) సిద్దాంత శిరోమణి ఎవరి రచన.?
జ : భాస్కరాచార్య – 2

27) లీలావతి గణితం అసలు పేరు ఏమిటి.?
జ : పాటి గణితం, అంక గణితం

28) ఏ ఇక్ష్వాక రాజు వ్యవసాయ అభివృద్ధి కోసం నాగలి, ఆవులు, ఎద్దులు దానం చేసినట్లు చెప్పబడింది.?
జ : శాంత మూలుడు

29) వరంగల్ లో ఉన్న పద్మాక్షి ఆలయం ఏ మతానికి అనుబంధంగా ఉన్న దేవాలయము.?
జ : జైన మతం

30) టీం ఇండియా మరియు నాలెడ్జ్ & ఇన్నోవేషన్ హబ్ అనేది ఏ సంస్థ యొక్క ప్రధాన అంగాలు.?
జ : నీతి ఆయోగ్

4) చైనా దేశంలో వ్యోమగామి ని ఏమని పిలుస్తారు.?
జ : టైకోనాట్

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →