Manugur polytechnic students protest against shakti

Polytechnic Students – మణుగూరు పాలిటెక్నిక్ విద్యార్థుల వినూత్న నిరసన

BIKKI NEWS (SEP. 11) : Manugur Polytechnic students protest against SHAKTI. మణుగూరులోని గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు తమ విద్యా భవిష్యత్తుకు సంబంధించిన సమస్యలపై ఈరోజు వినూత్నంగా నిరసన తెలిపారు. విద్యార్థులందరూ గౌరవనీయులైన హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి పోస్టుకార్డుల ద్వారా తమ సమస్యలను తెలియజేస్తూ, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను SHAKTI పరిధిలోకి తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు.

Manugur Polytechnic students protest against SHAKTI

ఈ సందర్భంగా విద్యార్థులు “SHAKTI వద్దు – మా పాలిటెక్నిక్ విద్యను కాపాడండి”, “AICTE–SBTET వ్యవస్థను కొనసాగించాలి” అంటూ నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. తమ డిప్లొమా విద్య, గుర్తింపు, ఉన్నత విద్యా అవకాశాలు, స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి అంశాలను పరిరక్షించాలని విద్యార్థులు కోరారు.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →