BIKKI NEWS (SEP. 11) : Freshers day in GJC Husnabad . విద్యార్థి దశ నుంచి నిర్దిష్టమైన లక్ష్యాలను విద్యార్థులు ఏర్పరచుకొని క్రమశిక్షణతో కష్టపడి చదివితే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కే. రవీందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ చెన్నూరి గంగాధర్ అధ్యక్షతన జరిగిన కళాశాల ఫ్రెషర్స్ డే సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
Freshers day in GJC Husnabad
ఈ సమావేశ ఆరంభంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కె.రవీందర్ రెడ్డి తో పాటు హుస్నాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ దండిలక్ష్మి మరియు హుస్నాబాద్ పట్టణ సీఐ కె. శ్రీధర్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన గావించారు.
ఈ సందర్భంగా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి మాట్లాడుతూ “ఇంటర్మీడియట్ దశ అనేది విద్యార్థుల భవిష్యత్తుకు అత్యంత కీలకమైనదని అన్నారు క్రమశిక్షణతో చదివి అనుకున్న లక్ష్యాలను సాధించాలన్నారు. ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో అనుభవజ్ఞులైన అధ్యాపకులు, విశాలమైన తరగతి గదులు, డిజిటల్ విద్యాబోధన అందుబాటులో ఉందని, వాటిని విద్యార్థులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. హుస్నాబాద్ ప్రభుత్వ బాలుర కళాశాలకు సరిపడా డ్యూయల్ డెస్కులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు”
మరో ముఖ్య అతిథి మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మి మాట్లాడుతూ… ప్రభుత్వ సహకారంతో కళాశాలకు అదనపు తరగతి గదులు నిర్మాణం చేయుటకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు విద్యార్థులు మంచి లక్ష్యం ఏర్పాటు చేసుకొని ఉన్నతంగా ఎదగాలని సూచించారు
మరో ముఖ్య అతిథి సిఐ కే.శ్రీధర్ మాట్లాడుతూ… విద్యార్థులకు ఇంటర్మీడియట్ దశ కీలకమైనదని అన్నారు భవిష్యత్తు లక్ష్యాన్ని ఇక్కడే ఏర్పాటు చేసుకొని చదువుకోవాలని పిలుపునిచ్చారు.*
తదనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ ఎస్.ఎస్.రాజు, S.సత్యనారాయణ, వి. రజని, ఎస్. వెంకటముత్యం, వి. సదాశివ్, సిహెచ్ .రాజిరెడ్డి, సిహెచ్. విద్యాసాగర్, టి. రణధీర్, బి.ఎల్లయ్య, ఎస్.అశోక్,
పి. చంద్రమోహన్, బి. వాల్య ఎం.వెంకటేష్, ఏ.మమత గ్రంథపాలకులు ఆర్ వాసవి మరియు వెంకట సాయి, శ్వేత తదితరులు పాల్గొన్నారు.
