BIKKI NEWS (DEC. 04) : Telangana job report 2025. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 61,379 ఉద్యోగాలను భర్తీ చేసిందని ఉద్యోగ నివేదిక 2025 నుండి విడుదల చేసింది. ఇంకా 8,632 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో ఉందని స్పష్టం చేసింది.
Telangana job report 2025
మరో 40 వేల ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో రెండేళ్లలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు, భర్తీ ప్రక్రియ, ప్రగతిపై ప్రభుత్వం నివేదిక విడుదల చేసింది.
వివిధ ఉద్యోగ ప్రకటనల ద్వారా టీజీపీఎస్సీ రెండేళ్లలో 15,780 నియామకాలు చేపట్టింది. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4లతో పాటు ఇతర విభాగాల్లోని 6,293 పోస్టుల భర్తీని కమిషన్ పూర్తిచేసింది.
16,067 మందికి కానిస్టేబుల్ కొలువులిచ్చామని పేర్కొన్నారు.
గ్రూప్-1 నోటిఫికేషన్‌ను563 పోస్టులతో కొత్త ప్రకటన జారీ చేశాం. పరీక్షలను విజయవంతంగా పూర్తిచేశాం.సెప్టెంబరు 27న నియామక పత్రాలను సీఎం అందజేశారు.
2024 డిసెంబరు 15, 16 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించాం.782 మందికి 2025 అక్టోబరు 18న నియామకపత్రాలిచ్చాం.
మూడేళ్ల క్రితం విడుదలైన గ్రూప్-3 నోటిఫికేషన్ ప్రజాప్రభుత్వ హయాంలో గాడిలో పడింది. 1,365 పోస్టులతో 2022 డిసెంబరు 30న ప్రకటన విడుదల చేయగా… 2024 నవంబరు 17, 18 తేదీల్లో పరీక్షలు జరిగాయి. ఈ ఏడాది మార్చిలో ఫలితాలొచ్చాయి. ప్రస్తుతం ధ్రువీకరణపత్రాల పరిశీలన కొనసాగుతోంది. త్వరలోనే వీరికి పోస్టింగులిస్తాం.
గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన గ్రూప్-4 తుది ఫలితాలను విడుదల చేశాం. ప్రజాప్రభుత్వ తొలి విజయోత్సవాల సందర్భంగా పెద్దపల్లిలో నిర్వహించిన యువ వికాసం వేదికపై 8,143 మందికి నియామక పత్రాలిచ్చాం.
తొలి ఏడాదిలోనే మెగా డీఎస్సీ నిర్వహించి 11,062 పోస్టులు భర్తీ చేశాం. 2024 జులైలో పరీక్షలు నిర్వహించి, రికార్డు వేగంతో సెప్టెంబరు 30న ఫలితాలిచ్చాం. 10,006 మంది ఉద్యోగాల్లో చేరారు.
గురుకుల సొసైటీల్లో టీజీటీ, పీజీటీ.. జూనియర్, డిగ్రీ లెక్చరర్ల పోస్టులన్నీ కలిపి 8,400 మందికి నియామక పత్రాలిచ్చాం.
మెడికల్ నియామక బోర్డు ద్వారా 8,666 మందికి కొలువులిచ్చాం. మరో 7,267 పోస్టుల భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో ఉంది. మార్చి నాటికి ఈ నియామకాలన్నీ పూర్తయ్యే అవకాశముంది.
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
