BIKKI NEWS (May 31) : Summer Holidays extension request for junior colleges in Telangana. తెలంగాణ రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు వేసవి సెలవులు పొడిగించాలని వివిధ ఉద్యోగ సంఘాలు సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రాల ద్వారా విన్నవించడం జరిగింది.
Summer Holidays extension request for junior colleges in Telangana.
తీవ్ర ఎండలు, అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలుల నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కోసం సెలవులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా తమ వినతి పత్రాలలో ఉద్యోగ సంఘాలు విన్నవించాయి.
ఇప్పటికే వివిధ యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ, పీజీ కళాశాలలకు జూన్ 6 వరకు వేసవి సెలవులు పొడిగిస్తూ ఉత్తర్వులు వెలువడిన సంగతి తెలిసిందే.
అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జూనియర్ కళాశాలలకు జూన్ 6 వరకు వేసవి సెలవులు పొడిగిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో తెలంగాణ రాష్ట్రంలో కూడా విద్యార్థుల ఆరోగ్య శ్రేయస్సు దృష్ట్యా జూనియర్ కళాశాలలకు వేసవి సెలవులు పొడిగించాలని పలు ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి.
దీనిపై సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం కోసం రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉద్యోగులు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.
