Inter - ఇంటర్ మార్క్స్ మెమో మరింత భద్రం - bikki news

INTER – ఇంటర్ మార్క్స్ మెమో మరింత భద్రం

BIKKI NEWS (DEC. 18) : INTERMEDIATE MARKS MEMO FULLY SECURED. తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికెట్లను మరింత భద్రంగా, నమ్మదగినవిగా మార్చనుంది. ఈ కొత్త విధానాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి తేనుంది.

INTERMEDIATE MARKS MEMO FULLY SECURED.

అందులో భాగంగా ఉండే ముఖ్య అంశాలు

  • UV ఫైబర్స్
  • హోలోగ్రామ్ & వాటర్‌మార్క్
  • రంగు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
  • నీరు & చించుకుపోని కాగితం
  • QR కోడ్ ద్వారా ఆన్‌లైన్ వెరిఫికేషన్
  • గత 6 ఏళ్ల విద్యార్థుల డిజిటల్ డేటా

UV ఫైబర్స్: సర్టిఫికెట్‌పై ఉన్న ఈ ఫైబర్స్ సాధారణంగా కంటికి కనిపించవు.UV లైట్ వేస్తే మాత్రమే కనిపిస్తాయి. నకిలీ సర్టిఫికెట్ అయితే వెంటనే బయటపడుతుంది.

హోలోగ్రామ్ & వాటర్‌మార్క్: సర్టిఫికెట్‌ను కాంతిలో చూసినప్పుడు ప్రత్యేక గుర్తులు కనిపిస్తాయి. ఇది అసలైన సర్టిఫికెట్టేనా కాదా అనేది సులభంగా తెలుసుకోవచ్చు.

రంగు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో : ఇప్పటివరకు నలుపు–తెలుపు ఫోటో ఉండేది. ఇకపై విద్యార్థి రంగు ఫోటో ముద్రిస్తారు. సర్టిఫికెట్ ఎవరిదో సులభంగా గుర్తించవచ్చు.

నీరు & చించుకుపోని కాగితం : కొత్త సర్టిఫికెట్ నీటిలో పడినా పాడవదు, సులభంగా చించుకుపోదు, కాగితం మరింత బలంగా ఉంటుంది. సర్టిఫికెట్ ఎక్కువకాలం భద్రంగా ఉంటుంది.

QR కోడ్ ద్వారా వెరిఫికేషన్ : ప్రతి సర్టిఫికెట్‌పై ఒక QR కోడ్ ఉంటుంది. మొబైల్‌తో స్కాన్ చేస్తే ..

  1. విద్యార్థి పేరు
  2. మార్కులు
  3. సంవత్సరం
  4. బోర్డు రికార్డు
    అన్నీ వెంటనే కనిపిస్తాయి. బోర్డు ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు.

డిజిటల్ డేటా భద్రత: గత 6 సంవత్సరాల విద్యార్థుల వివరాలు బోర్డు వెబ్‌సైట్‌లో డిజిటల్‌గా ఉంటాయి. ఫేక్ సర్టిఫికెట్లకు అవకాశం ఉండదు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →