- BIKKI NEWS : 21-01-2026
Inter 2nd year classes in summer after public exams. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు పూర్తయిన వెంటనే ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ద్వితీయ సంవత్సరం తరగతులను మార్చి 31 వరకు బోధించేలా అనుమతించాలని ఇంటర్ బోర్డు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం.
Inter 2nd year classes in summer after public exams
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ముగిసిన తర్వాత దాదాపు రెండున్నర నెలలపాటు విద్యార్థులకు వేసవి సెలవులు ఉంటున్నాయి. అయితే లాస్ట్ వర్కింగ్ డే మాత్రం మార్చి 31 గా ఉంటుంది.
దీంతో మార్చి 31 వరకైనా ఫస్ట్ ఇయర్ పూర్తయిన విద్యార్థులకు CBSE పద్దతిలో ద్వితీయ సంవత్సరం పాఠాలను బోధించేలా అనుమతించాలని బోర్డు కోరింది.
ఈ పద్ధతిని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు మార్చి 31 వరకు తరగతులు నిర్వహించే అవకాశం ఉంటుంది.
అయితే ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయిన వెంటనే స్పాట్ వాల్యూషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. దీంతో ఎంతమంది లెక్చరర్లు కళాశాలలో అందుబాటులో ఉంటారనేది ప్రధాన అంశంగా ఉండనుంది.
- Standard GK bits in Telugu part 194 – జీకే బిట్స్
- Karimnagar NHM jobs notification 2026 – లక్ష వరకు వేతనంతో కాంట్రాక్టు జాబ్స్
- AP DSC notification 2026 – 2721 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్
- Top current affairs in Telugu 13th October 2026 – కరెంట్ అఫైర్స్
- NPCI on UPI MDR Charges 2026 – దీపావళి తర్వాత UPI చెల్లింపులపై ఛార్జీలు

