UDISE – యూడైస్ లో పేరుంటేనే పది, ఇంటర్ పరీక్షలకు అనుమతి.!

BIKKI NEWS (OCT. 22) : APAAR COMPULSORY FOR 10th and Inter exams. పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షల ఫీజు చెల్లించడానికి యూడైస్ లో తప్పకుండా నమోదు అయి ఉండాలి. అలాగే అపార్ నెంబర్ ఖచ్చితంగా పొంది ఉండాలి.

APAAR COMPULSORY FOR 10th and Inter exams

యూడైస్ లో పేరు లేకపోతే పరీక్షలు రాసేందుకు అనుమతించరు. పరీక్ష ఫీజు కట్టేందుకే వీలుండదు. ఇంటర్ లోనూ యూడైస్ నమోదును అధికారులు తప్పనిసరి చేశారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 9లక్షలకు పైగా విద్యా ర్థులు ఇంటర్ చదువుతున్నారు. ఇప్పటి వరకు 75% విద్యార్థుల పేర్లు మాత్రమే యూడైస్ లో నమోదయ్యాయి. మరో 25% నమోదు పెండింగ్ లో ఉన్నాయి.

పదో తరగతి విద్యార్థులకు ఇప్పటికే యూడైస్ తో అనుసంధానించారు. కొత్తగా ఈ విద్యాసంవత్సరం నుంచి ఇంటర్ లోనూ యూడైస్ ఎంట్రీ ప్రారంభించారు.

ఆధార్ లో తప్పులుండటం, వాటిని సవరించాల్సి ఉండటంతో మిగతా వాళ్ల నమోదులో సమస్య తలెత్తుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు.

ఇక రాష్ట్రంలో అపార్ నమోదు ఇప్పటి వరకు 64% మాత్రమే నమోదుచేస్తున్నారు.

FOLLOW US :

@WHATSAPP | @TELEGRAM | @FACEBOOK