BIKKI NEWS (DEC. 26) ) : Telangana Upcoming job notifications 2026. తెలంగాణ రాష్ట్రంలో 2026 నూతన సంవత్సరాలలో వెలువడే అవకాశం ఉన్న వివిధ ఉద్యోగ నోటిఫికేషన్ వివరాలు…
Telangana upcoming job notifications 2026.
అంగన్వాడీ ఉద్యోగాలు: 14,236 అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ త్వరలోనే విడుదల కానుంది.
ఆర్టీసీ ఉద్యోగాలు : 10,038 ఆర్టీసీ ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్ రానుంది. (కొన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు)
పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులు : పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్ వెల్లడయ్యే అవకాశం
బీట్ ఆఫీసర్ పోస్టులు : బీట్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి మరో నోటిఫికేషన్ కూడా త్వరలో రావచ్చు.
గురుకులాల్లో పోస్టులు: గురుకులాల్లో బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడే అవకాశం
డిగ్రీలెక్చరర్, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు: ఈ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్లు త్వరలో వెలువడే అవకాశం ఉంది. ఆర్థిక శాఖ ఆమోదం కూడా లభించింది.
సింగరేణి కాలరీస్, ఇంజినీరింగ్ పోస్టులు: సింగరేణి కాలరీస్ మరియు ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్లు రావచ్చు.
టీచర్ పోస్టులు: టెట్ పరీక్షపూర్తయిన తర్వాత, మరో 5,000 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు..
గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు: గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావచ్చు
జేఎల్ పోస్టులు : నూతనంగా ఏర్పడిన జూనియర్ కళాశాలల్లో దాదాపు 200 కి పైగా జూనియర్ లెక్చరర్ పోస్టుల మంజూరుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
వైద్య ఆరోగ్య శాఖ : వైద్య ఆరోగ్య శాఖలో కూడా నూతన సంవత్సరంలో భారీగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.
యూనివర్సిటీలలో : యూనివర్సిటీలలో కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

