TRANSFERS – మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్ర‌భుత్వం- మంత్రి సీత‌క్క‌

317 effected village secretaries transfers in PR department
  • జీవో నెం.317 తో న‌ష్టపోయిన పంచాయ‌తీ కార్య‌ద‌ర్శుల‌కు న్యాయం చేస్తున్నాం
  • పంచాయతీ సెక్రటరీస్ అసోసియేషన్ క్యాలెండర్, డైరీని ఆవిష్క‌రించిన మంత్రి సీత‌క్క‌
  • మంత్రికి, ప్ర‌భుత్వానికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన పంచాయ‌తీ కార్య‌ద‌ర్శులు

BIKKI NEWS (FEB. 18) : 317 effected village secretaries transfers in PR department. . సచివాలయంలో పంచాయతీ సెక్రటరీస్ అసోసియేషన్ (TPSA) క్యాలెండర్, డైరీను పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా. ద‌న‌స‌రి అన‌సూయ‌ సీతక్క బుధవారం నాడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులను అభినందించిన మంత్రి, గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర ఎంతో కీలకమని ప్రశంసించారు.

317 effected village secretaries transfers in PR department

జీవో నెం.317 కారణంగా స్థానికత కోల్పోయి దూర ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న 223 మంది పంచాయతీ కార్యదర్శులకు రెండు సంవత్సరాల పాటు అంతర్ జిల్లా డిప్యూటేషన్‌పై నియామకానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు. జీవో ప్రతులను మంత్రి సీతక్క చేతుల మీదుగా స్వీకరించిన కార్యదర్శులు ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఉద్యోగులకు అనుకూలమైన ప్రభుత్వమని స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తోందని, అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించి అంతర్ జిల్లా డిప్యూటేషన్లకు అనుమతి ఇచ్చామని తెలిపారు. ఈ నిర్ణయంతో 223 మంది పంచాయతీ కార్యదర్శులకు గణనీయమైన ఊరట లభించిందన్నారు. మిగిలిన సమస్యల పరిష్కారంపైనా ప్రభుత్వం సానుకూలంగా ఉందని, అధికారులతో చర్చించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు.

జీవో నెం.317 వల్ల నష్టపోయిన పంచాయతీ కార్యదర్శులకు న్యాయం చేస్తూ అంతర్ జిల్లా డిప్యూటేషన్లకు అనుమతులు మంజూరు చేసినందుకు మంత్రి సీతక్కకు కార్యదర్శులు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క కృషి వల్లే జీవో నెం.317లో ఉన్న లోపాలను సరిదిద్దే దిశగా పంచాయతీ రాజ్ శాఖ ముందంజలో నిలిచిందని వారు కొనియాడారు.

ఈ కార్య‌క్ర‌మంలో టీపీఎస్‌ఏ అధ్యక్షుడు పి. మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఈ. శ్రీనివాస్, ట్రెజ‌ర‌ర్ జె. పాండరినాథ్, ఉపాధ్యక్షుడు సి. నాగేశ్, అర్గ‌నైజింగ్ సెక్ర‌ట‌రి బి. సురేష్ గౌడ్, ఈసీ స‌భ్యులు ఎం. కవితా దేవి, ఆర్. వేణు త‌దిత‌ర‌లు డైరి ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో పాల్గోన్నారు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of BIKKI NEWS

About BIKKI NEWS

"A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by BIKKI NEWS →