Telangana volunteer jobs - తెలంగాణలో 10,909 వాలంటీర్ జాబ్స్ - bikki news

Telangana Volunteer jobs – తెలంగాణలో 10,909 వాలంటీర్ జాబ్స్

BIKKI NEWS (FEB. 17) : Telangana volunteer jobs notification 2026. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 10,909 వాలంటీర్ ఉద్యోగాలను తాత్కాలిక పద్ధతిలో నియమించాలని నిర్ణయం తీసుకుంది. (ఉద్యోగ నోటిఫికేషన్ లు)

Telangana volunteer jobs notification 2026

పంటల నమోదు సర్వే కోసం గ్రామానికి ఒక వాలంటీర్ చొప్పున 10,909 మంది వాలంటీర్లను నియమించుకోవాలని వ్యవసాయ శాఖా నిర్ణయం తీసుకుంది .

Telangana volunteer eligibility

పదో తరగతి నుండి డిగ్రీ వరకు అర్హత కలిగిన గ్రామానికి సంబంధించిన అభ్యర్థులు ఈ వాలంటీర్ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

గ్రామంలోని వ్యవసాయ భూములపై మరియు వ్యవసాయంపై పూర్తి అవగాహన ఉన్నవారికి నియామక ప్రక్రియలో ప్రాధాన్యత ఇవ్వబడుతుందని వ్యవసాయ శాఖ ప్రకటించింది.

Volunteer application process

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్ధులు మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో నేరుగా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.

ఈ యాసంగి సీజన్ లో 45 రోజులపాటు గ్రామంలోని వ్యవసాయ భూములను, పంటలను ఫోటోలు తీసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.

volunteer salary

ఒక్కో ఫోటోకు 7 నుంచి 10 రూపాయల చొప్పున చెల్లిస్తారు. మొత్తం 2,000 ఫోటోల వరకు గరిష్టంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. గరిష్టంగా 20 వేల వరకు రెమ్యూనరేషన్ చెల్లిస్తారు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →