- BIKKI NEWS : 12 JAN. 2026
22 ITEMS KIT FOR TELANGANA GOVT SCHOOL STUDENTS. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించనున్న 22 వస్తువులతో కూడిన కిట్‌కు సంబంధించి నాణ్యత విషయంలో రాజీపడొద్దని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులకు సూచించారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే నాటికి విద్యార్థులకు కిట్ అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
22 ITEMS KIT FOR TELANGANA GOVT SCHOOL STUDENTS
ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలల విద్యార్థులకు అందించే వస్తువులకు సంబంధించి సెంట్రల్ ప్రొక్యూర్మెంట్‌పై ముఖ్యమంత్రి గారు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల విషయంలో ఖర్చుకు వెనకాడొద్దని, ఎట్టి పరిస్థితుల్లోనూ నాణ్యత విషయంలో రాజీ పడొద్దని తెలిపారు.
యూనిఫామ్‌తో పాటు 21 వస్తువులతో కూడిన కిట్‌ను విద్యార్థులకు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. స్కూల్ బెల్ట్, టై, షూస్, స్కూల్ బ్యాగ్, నోట్ బుక్స్, ఇతర వస్తువులను అందించేందుకు అవసరమైన ప్రొక్యూర్మెంట్ ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు.

ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లకు సంబంధించిన పెండింగ్ బిల్లులకు సంబంధించి పూర్తి వివరాలను అందించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమీక్ష సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి గారు, వేం నరేందర్ రెడ్డి గారు, స్పెషల్ సీఎస్ సబ్యసాచి ఘోష్ గారు, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు గారు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
- Today current affairs in Telugu May 12th 2026 – కరెంట్ అఫైర్స్
- Daily current affairs in Telugu May 11th 2026 – కరెంట్ అఫైర్స్
- Top current affairs 10th May 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Today Gold Rate June 14th 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- TG ICET 2026 Results విడుదల, ర్యాంక్ కార్డు కోసం క్లిక్ చేయండి

