- గౌరవ ముఖ్యమంత్రి గారికి TGJLA-475 సంఘం వినతి పత్రం
BIKKI NEWS (APRIL 22) : JLs should be given the opportunity to transfer with 2 conditions.. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల నిషేధం తొలగిస్తూ జీవో 38 ని విడుదల చేయడం పట్ల ఉత్తర్వులు జారీ చేయటాన్ని స్వాగతిస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ _475 రాష్ట్ర అధ్యక్ష /కార్యదర్శులు డాక్టర్ వస్కుల శ్రీనివాస్, డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ తెలిపారు.
JLs should be given the opportunity to transfer with 2 conditions
అయితే జీవో నెంబర్ 38 లో ఒకే చోట మూడు సంవత్సరాలు పని చేస్తూ మూడు సంవత్సరాలు పూర్తయిన వారికి మాత్రమే బదిలీలో అవకాశం కల్పించడం జరిగిందని, ఈ నిబంధన వలన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒకే చోట 15 సంవత్సరాల పైగా కాంట్రాక్ట్ లెక్చరర్ గా పనిచేస్తూ జీవో నెంబర్ 16 ప్రకారం మే 4 – 2023 న క్రమబద్ధీకరించబడిన అధ్యాపకులు గత 18 సంవత్సరాలుగా బదిలీలు లేక ఒకే కళాశాలలో పనిచేస్తూ అనేక మానసిక, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఈ సందర్భంగా వినతి పత్రంలో పేర్కొన్నారు
అలాగే 2024 లో జరిగిన బదిలీల్లో లో రెండు సంవత్సరాలు నిబంధన వలన అప్పటికి రెగ్యులర్ అయిన అధ్యాపకులు రెండు సంవత్సరాలు పూర్తి కాకపోవటంతో బదిలీ అవకాశం కోల్పోయినమని… ప్రస్తుత బదిలీలో మూడు సంవత్సరాల నిబంధన వల్ల మరల బదిలీల అవకాశం కోల్పోతున్నామని తెలుపుతూ.. గత బదిలీల్లో ఇచ్చిన రెండు సంవత్సరాలు నిబంధనలాగానే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేసే అధ్యాపకుల బదిలీలకు ప్రత్యేకంగా రెండు సంవత్సరాలు దాటిన వారికి బదిలీలకు అవకాశం కల్పించాలని కోరుతూ, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రివర్యులు ఏ రేవంత్ రెడ్డి గారికి మరియు విద్యాశాఖ కార్యదర్శి గారికి, ఇంటర్ విద్య డైరెక్టర్ గారికి ఆన్లైన్ ద్వారా వినతిపత్రం పంపించినట్లు తెలిపారు.
గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులు కు 2 సంవత్సరాలు నిండిన వారికి బదిలీ అవకాశం కల్పించాలని విన్నవిస్తున్నట్లు తెలిపారు.

