Tot - జూనియర్ లెక్చరర్లకు నూతన సిలబస్ పై శిక్షణ - bikki news

ToT – జూనియర్ లెక్చరర్లకు నూతన సిలబస్ పై శిక్షణ

BIKKI NEWS (05 AUG) : Intermediate board 2nd spell ToT completed. ఇంటర్మీడియట్ విద్య లో Spell-II రాష్ట్రస్థాయి Training of Trainers (ToT) వర్క్‌షాప్‌లో భాగంగా ఈ రోజు ముగిసింది. ఈ వర్క్‌షాప్‌ను ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్ల కోసం తెలంగాణ అంతటా నిర్వహించారు. 2026–27 విద్యాసంవత్సరానికి సవరించిన పాఠ్యాంశాలను సమర్థవంతంగా అమలు చేయడం, విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని పెంచడం, విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం లక్ష్యంగా ఇంటర్ విద్యా శాఖ (DIE) 5 రోజుల రాష్ట్రస్థాయి ToT వర్క్‌షాప్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమం నాలుగు శిక్షణా కేంద్రాలలో విజయవంతంగా ముగిసింది.

Intermediate board 2nd spell ToT completed

అభిలాషా అభినవ్, IAS, ఇంటర్ విద్యా సంచాలకురాలు & కార్యదర్శి, ఈ వర్క్‌షాప్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. Spell-I (జూలై 31, ఆగస్టు 1)లో తెలుగు, రసాయనశాస్త్రం, భౌతికశాస్త్రం, వృక్షశాస్త్రం, వాణిజ్యం, ఆర్థికశాస్త్రం వంటి ప్రధాన విషయాలలో శిక్షణ ఇచ్చారు. Spell-II (ఆగస్టు 4, 5)లో గణితం, జంతుశాస్త్రం, హిందీ, చరిత్ర, పౌరశాస్త్రం వంటి విషయాలలో శిక్షణ జరిగింది.

మొత్తం 400 మంది పాల్గొనగా, Kakatiya Hall (DIE), Conference Hall (TGBIE), Command Control Room (TGBIE), GJC కాచిగూడ వేదికలలో శిక్షణ విజయవంతంగా పూర్తయింది.

అభిలాషా అభినవ్, Director of Intermediate Education, మాట్లాడుతూ… “జూనియర్ లెక్చరర్లు విద్యార్థుల విజయానికి, విద్యా ప్రావీణ్యత కీలక పాత్ర పోషిస్తుంది. ఈ రాష్ట్రస్థాయి ToT వర్క్‌షాప్ ద్వారా మాస్టర్ ట్రైనర్లు మరియు జిల్లా వనరుల వ్యక్తులకు సవరించిన పాఠ్యాంశాలపై లోతైన అవగాహన, 80%:20% పరీక్షా విధానం, ప్రాక్టికల్ SOPలు, డిజిటల్ క్లాస్‌రూమ్ సాధనాలు (IFPs/IDPs), పరిశ్రమ అనుసంధానాలు అందిస్తున్నాం. Cascade Training Model ద్వారా శిక్షణ పొందిన DRPs తమ జిల్లాలలోని ప్రతి జూనియర్ లెక్చరర్‌కు ఇదే విధమైన శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తారు.”

శిక్షణా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు:

పాఠ్యాంశం & బోధన సమన్వయం: AY 2026–27 సవరించిన సిలబస్, ప్రాక్టికల్ SOP అమలు, డిజిటల్ సాధనాల వినియోగం.
సవరించిన పరీక్షా విధానం: 80%:20% పరీక్షా విధానం అమలు పై అవగాహన.

Cascade Training Model: DRPs రాష్ట్రస్థాయి శిక్షణ పొందిన తరువాత, జిల్లా స్థాయిలో 2-రోజుల FDPలు నిర్వహిస్తారు.

మిగిలిన Spell: ఆగస్టు 17న మూడవ Spell జరుగుతుంది. ఇందులో సంస్కృతం, ఉర్దూ, అరబిక్, ఫ్రెంచ్ వంటి ద్వితీయ భాషలపై శిక్షణ ఉంటుంది.

Command Control Room (CCR, TGBIE)లో శ్రీ యెంక్యా నాయక్, JD (FAC), ప్రోగ్రామ్ కోఆర్డినేటర్లు డా. జ్యోత్స్న రాణి, ప్రిన్సిపాల్ SIVE మరియు జయమణి, AGTPC శిక్షణా కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

GJC కాచిగూడ వేదికలో హైదరాబాద్ జిల్లా ఇంటర్ విద్యా అధికారి (DIEO) ఒడ్డెన్నా, ప్రిన్సిపాల్ డా. ఏ. చిరంజీవి, సీనియర్ లెక్చరర్లు శిక్షణా కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →