కళ్ళెం/జనగాం (ఆగస్టు 09) : BJR union kallem President Karunakar. దళిత వర్గాల ఆశాజ్యోతి, నిరంతరం దళిత కులాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయులు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి ఆలోచనల, ఆశయాల సాధనలో భాగంగా ఈరోజు కళ్ళెం గ్రామంలో పెద్దలు, యువజన సంఘాల నాయకుల సమక్షంలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది.
BJR union kallem President Karunakar.
BJR సంఘం శాశ్వత గౌరవ అధ్యక్షులుగా చీటకోడూరు బిక్షపతి సార్ గారు, సభాధ్యక్షులు దళితరత్న డా.మబ్బు పరశురామ్ అధ్యక్షులు డా||మబ్బు కరుణాకర్, ఉపాధ్యక్షులు మబ్బు భాస్కర్, తిప్పారపు ప్రసాద్ , ప్రధాన కార్యదర్శి మబ్బు (పొట్టోల్ల) కరుణాకర్, కోశాధికారి మబ్బు(పర్రెబావి) అశోక్ గా అందరిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ నా పై నమ్మకంతో ఎన్నుకున్న మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, మహానీయుల ఆశయాలను మీ సహకారంతో ముందుకు తీసుపోవుటలో బాధ్యత వహిస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆదాం, రమేష్, యాకూబ్, ఉప్పలయ్య, SP పరశురాములు, క్రాంతి కుమార్ వార్డు సభ్యులు, కన్నయ్య, అంజయ్య మరియు అధిక సంఖ్యలో యువకులు అందరూ పాల్గొని నూతన సంఘం ఎన్నిక సమావేశం విజయవంతం చేయడం జరిగింది.
