BIKKI NEWS (SEP. 26) : TG TET 2026 II for inservice Teachers. తెలంగాణలోని ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల కోసం పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయుల అర్హత కోసం నిర్వహించే రెండో విడత స్పెషల్ టెట్ షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది.
TG TET 2026 II for inservice Teachers
ప్రభుత్వ ఉత్తర్వులు అనుసరించి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ మరియు టీజీటెట్ చైర్పర్సన్ సెప్టెంబర్ 26న ఈ పత్రికా ప్రకటననుజారీ చేశారు.
టీజీ స్పెషల్ టెట్-2 ముఖ్యమైన తేదీలు
| వివరాలు | తేదీ |
|---|---|
| అధికారిక ప్రకటన విడుదల | 26 సెప్టెంబర్ 2026 |
| వివరమైన నోటిఫికేషన్ విడుదల | 01 అక్టోబర్ 2026 |
| కంప్యూటర్ ఆధారిత (CBT) పరీక్షలు | 16 నవంబర్ 2026 నుండి 21 నవంబర్ 2026 వరకు |
ఆన్లైన్ విధానంలోనే పరీక్షల నిర్వహణ
ఈ రెండో విడత స్పెషల్ టెట్ పరీక్షలను కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ పద్ధతిలోనే (CBT) నిర్వహించనున్నారు. నవంబర్ 16 నుండి నవంబర్ 21 వరకు పలు విడతల్లో ఈ పరీక్షలు జరుగుతాయి.
అక్టోబర్ 1న విడుదల కానున్న పూర్తి స్థాయి నోటిఫికేషన్లో ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ తేదీలు, అర్హతలు, సిలబస్, పరీక్ష ఫీజు మరియు హాల్‌టికెట్ల డౌన్లోడ్ తదితర పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.

