Guest lecturers - మంత్రి అడ్లూరి దృష్టికి గెస్ట్ అధ్యాపకుల సమస్యలు - bikki news

Guest Lecturers – మంత్రి అడ్లూరి దృష్టికి గెస్ట్ అధ్యాపకుల సమస్యలు

BIKKI NEWS (August 01) : Guest Lecturers issues to Minister Adhuri Laxman Kumar. తెలంగాణ రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి వర్యులు గౌరవ శ్రీ అడ్లూరి. లక్ష్మణ్ కుమార్ గారిని మర్యాద పూర్వకంగా కలిసిన 2152 అసోసియేషన్ రాష్ట్ర నాయకత్వం.

Guest Lecturers issues to Minister Adhuri Laxman Kumar

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులకు సక్రమంగా నెల నెల వేతనాలు ఇవ్వాలనే ప్రభుత్వ నిర్ణయం మేరకు మంత్రి గారిని ఈరోజు కలిసి ధన్యవాదాలు తెలియజేసిన ప్రభుత్వ జూనియర్ కళాశాలల గెస్ట్ లెక్చరర్స్ రాష్ట్ర అధ్యక్షులు దామెర. ప్రభాకర్, రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ కోడి. మహేష్ కుమార్, రాష్ట్ర నాయకులు బొల్లె నాగరాజు, వీరన్న కలిసి పలు సమస్యలు మంత్రి గారికి వివరించడం జరిగింది.

ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇంటర్ బోర్డ్ డైరెక్టర్, ఇంటర్ అధికారులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

అదే విధంగా గతంలో డిస్టర్బ్ అయి ఇంకా అడ్జస్ట్ కాని వారికి ప్రాధాన్యత ఇచ్చి మల్టీ జోనల్ వైజ్ గా ఉన్న ఖాళీలలో సీనియారిటీ ప్రాతిపదికన అడ్చస్ట్ చేసి ఆదుకోవాలని, వొకేషనల్ సబ్జెక్టులలో అదనపు గెస్ట్ లెక్చరర్లను నియమించాలని, స్ట్రెంత్ ఎక్కువగా ఉన్న సబ్జెక్టులలో అడిషనల్ పోస్ట్ లను క్రియేట్ చేసి డిస్టర్బ్ అయిన వారిని అడ్జస్ట్ చేయాలని కోరారు.

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →