BIKKI NEWS (MAY 01) : Today employees JAC meet Bhatti Vikramarka. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలపై నేడు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో టీజీవో, టీఎన్‌జీవో, సెక్రటేరియట్ అసోసియేషన్ (టీజీఎస్‌ఏ), పీఆర్‌టీయూ టీఎస్, ఎస్‌టీయూ టీఎస్, ట్రెస్మా, క్లాస్ 4 ఎంప్లాయీస్ సెంట్రల్ అసోసియేషన్, టీఎస్ యూటీఎఫ్, టీఆర్‌టీఎఫ్ నేతలు పాల్గొననున్నారు.
Today employees JAC meet Bhatti Vikramarka
ఉద్యోగ సంఘాల జేఏసీ మే 5 న రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలు నిర్వహించనున్నారు. ఈక్రమంలోనే ప్రభుత్వం ఆయా సమస్యలపై చర్చించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఇటీవల శాఖల వారీగా ఉద్యోగుల డిమాండ్ల వివరాలను అత్యవసరంగా పంపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 64 డిమాండ్లు ఉన్నా…ప్రధానంగా పీఆర్‌సీ నివేదిక తెప్పించుకొని అమలు చేయాలన్న దానిపైనే సంఘాల నేతలు పట్టుబట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. కొత్త పీఆర్‌సీని 2023 జులై 1 నుంచి అమలు చేయాల్సి ఉంది.
అలాగే విశ్రాంత ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలను ఏక మొత్తంలో చెల్లించాలనే డిమాండ్ కూడా ప్రధానమైంది
అలాగే సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ కూడా ప్రధానమైంది.
Also Read…
• తాజా విద్యా సమాచారం
• తాజా జాబ్ నోటిఫికేషన్స్
• ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
• కరెంట్ అఫైర్స్
• జీకే బిట్స్
• ఎంప్లాయిస్ న్యూస్

