హైదరాబాద్ (ఏప్రిల్ 10) : TG JAC action plan for employees issues. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (TG JAC) కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం (ఏప్రిల్ 10, 2026) హైదరాబాద్‌లో నిర్వహించిన టీజీఈ జేఏసీ విస్తృత స్థాయి సమావేశంలో ఉద్యోగుల పెండింగ్ డిమాండ్లపై చర్చించి, భవిష్యత్ కార్యచరణను ప్రకటించారు.
TG JAC action plan for employees issues
జూన్ 2వ తేదీ నాటికి ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించాలని తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ వి. లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ ఓడనాల రాజశేఖర్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తమ కార్యాచరణ ఉంటుందన్నారు. 2026 జూన్ 2వ తేదీ నాటికి పీఆర్పీ అమలుతో పాటు పెండింగులో ఉన్న ఐదు డీఏలను వెంటనే విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ వి. లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ రాజశేఖర్ మాట్లాడుతూ రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్స్ అన్నీ క్లియర్ చేయాలనని కోరారు. రిటైర్డ్ ఉద్యోగులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ కార్డ్స్ జారీ చేసి తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.
అలాగే సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ విధానంను పునరుద్ధరించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 2004 సెప్టెంబర్ 1వ తేదీకి ముందు నియామకమైన ఉద్యోగులకు వెంటనే ఓపీఎస్ విధానమును అమలు చేయాలన్నారు.
గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 61 సంవత్సరాలు నిండిన వీఆర్ఏల వారసుల ఉద్యోగ నియామక సమస్యను సత్వరం పరిష్కరించాలని కోరారు.
అలాగే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు.
పీఆర్సీ నుంచి ఓపీఎస్ వరకు.. ప్రధాన డిమాండ్లు ఇవే:
ఈ సమావేశంలో జేఏసీ నాయకులు ప్రభుత్వం ముందు 10 ప్రధాన డిమాండ్లను ఉంచారు. ముఖ్యంగా పీఆర్సీ అమలుపై డెడ్ లైన్ విధించడం గమనార్హం.
- పీఆర్సీ అమలు: జూన్ 2వ తేదీ నాటికి కొత్త పీఆర్సీ (PRC) అమలు చేయాలి.
- పెండింగ్ బిల్లులు: రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన అన్ని పెండింగ్ బిల్లులను వెంటనే క్లియర్ చేయాలి.
- హెల్త్ కార్డ్స్: నగదు రహిత వైద్యం కోసం హెల్త్ కార్డ్స్ తక్షణమే అమలులోకి తీసుకురావాలి.
- పాత పెన్షన్ విధానం (OPS): సీపీఎస్ (CPS) రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి. 2004 సెప్టెంబర్ 1 కంటే ముందు నియామకమైన వారికి వెంటనే ఓపీఎస్ అమలు చేయాలి.
- డీఏ బకాయిలు: పెండింగ్ బకాయిలతో పాటు డీఏ (DA) వెంటనే విడుదల చేయాలి.
- ఉద్యోగ భద్రత: అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి.
- బదిలీలు: ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించి సాధారణ బదిలీలు (Transfers) చేపట్టాలి.
కార్యాచరణ ప్రకటించిన జేఏసీ:
ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు జేఏసీ రెండు దశల నిరసన కార్యక్రమాలను ఖరారు చేసింది:
- ఏప్రిల్ 17: రాష్ట్రవ్యాప్తంగా మండల, డివిజన్ కేంద్రాల్లో భోజన విరామ సమయంలో తహసీల్దార్లకు వినతి పత్రాలు అందజేయడం.
- మే 5: జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించి, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం.
జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశంలో టీజీఈ జేఏసీ సెక్రటరీ జనరల్, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు ఓడనాల రాజశేఖర్, తెలంగాణ డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ కె. రామకృష్ణ, తెలంగాణ తహసీల్దార్ల అసోసియేషన్ అధ్యక్షులు ఎస్. రాములు, జనరల్ సెక్రటరీ రమేష్ పాక, సెక్రటరీ జనరల్ పూల్ సింగ్, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బాణాల రాంరెడ్డి, టీజీఆర్ఎస్ఏ ఉపాధ్యక్షులు భిక్షం, రాష్ట్ర కోశాధికారి మల్లేష్, మహిళా విభాగం అధ్యక్షురాలు రాధ, తెలంగాణ ప్రాంత ఉద్యోగ సంఘం అధ్యక్షులు కె. హన్మంత్ రావు, తెలంగాణ కమర్షియల్ టాక్స్ అసోసియేషన్ అధ్యక్షులు దేవేందర్, తెలంగాణ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జీ. కృపాకర్, తెలంగాణ అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కె. రాములు, తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు డా.జి. నిర్మల, తెలంగాణ మజ్దూర్ యూనియన్ అధ్యక్షులు అశ్వద్దామ రెడ్డి, తెలంగాణ సీపీఎస్ ఎంప్లాయిస్ అధ్యక్ష, కార్యదర్శి దర్శన్ గౌడ్, ఉపేందర్ రావు, తెలంగాణ మెడికల్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు ఎన్ రాబర్ట్ బ్రూస్, తెలంగాణ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్ అధ్యక్షులు డా.కత్తి జనార్దన్, తెలంగాణ డీజేబుల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు హాబీబ్ మస్తాన్, తెలంగాణ జీపీవో అసోసియేషన్ అధ్యక్షులు గరికే ఉపేందర్ రావు, తెలంగాణ జ్యూడిషియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్. వీ. సుభాష్, సెకండరీ గ్రేడ్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి, జీ.హెచ్.ఎమ్.సీ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు ఉద్దరి గోపాల్, తెలంగాణ డివిజనల్ అకౌంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు సీహెచ్.రవి, రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ అధ్యక్షులు ఎస్. నర్సింహులు, తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఫిమేల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు రొక్కం దేవిక, తెలంగాణ ప్రభుత్వ ఫార్మాసి ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బి. సుదర్శన్ గౌడ్, టీజీబీసీ ఉపాద్యాయ సంఘం ఎం. చంద్రశేఖర్ గౌడ్, ఎస్సి, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు కొంగల వెంకట్, తెలంగాణ మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు కె.సాయిరెడ్డి, తెలంగాణ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు పి. లక్ష్యయ్య, రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ అధ్యక్షులు ఎస్. నర్సింహులు, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ టీచర్, లెక్షరర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆవుల శ్రీధర్, ప్రైమరీ స్కూల్ టీచర్స్ యూనియన్ అధ్యక్షులు శిరందాస్ రాందాస్, తెలంగాణ ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు డా.రామకృష్ణ, ట్రైబల్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు హరికృష్ణ, తెలంగాణ ఎస్సి ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు సందీప్ కుమార్, మైనార్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండీ మొయినుద్దీన్, టెక్నికల్ ఎడ్యుకేషన్ బీసీ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు కిరణ్ కుమార్, తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ అధ్యక్షులు శ్రీకాంత్, తెలంగాణ లాంగ్వేజ్ కల్చరర్ డిపార్టుమెంట్ అసోసియేషన్ అధ్యక్షులు హేమలత, తెలంగాణ సీడ్ కార్పొరేషన్ అసోసియేషన్ అధ్యక్షులు మహేష్ కుమార్, హెచ్.ఎమ్.డబ్ల్యూ.ఎస్. అండ్ ఎస్.బీ.ఈ.డబ్ల్యూ.ఏ. అధ్యక్షులు సుగంధిని, స్పోస్ ఫోరమ్ అధ్యక్షులు వివేక్ తో పాటు అనేక సంఘాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
”ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ఒక ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం రూపొందించాలి. మా డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం ఆపేది లేదు.” అని జేఏసీ నేతలు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

