Employees demands - ఉద్యోగుల సమస్యలపై రిపోర్ట్ ఇవ్వాలని - bikki news

Employees Demands – ఉద్యోగుల సమస్యలపై రిపోర్ట్ ఇవ్వాలని

BIKKI NEWS (APRIL 29) : Telangana GAD asks about employees demands. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల, టీచర్ల, రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన 57 పెండింగ్ సమస్యలపై మే 1 లోగా నివేదిక అందించాలని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ (జీఏడీ) అన్ని శాఖలను ఆదేశించింది.

Telangana GAD asks about employees demands

తెలంగాణ ఉద్యోగ జేఏసీ లేవనెత్తిన దాదాపు 57 అంశాలపై ‘స్టేటస్ రిపోర్ట్’ మే 1వ తేదీలోగా ఈ రిపోర్ట్ పంపాలని ఈ సందర్భంగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ ప్రకటన, పెండింగ్ డీఏల విడుదల, మెడికల్ బిల్లుల చెల్లింపు, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 205 సంఘాల జేఏసీ నేతలు ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

మే 5వ తేదీన నిరాహార దీక్ష చేపడుతున్నట్టు ఇప్పటికే జేఏసీ ప్రకటించింది.15 వరకు ప్రభుత్వం స్పందించాలని లేకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఉద్యోగుల జేఏసీ తెలిపింది. ఈ నేపథ్యంలో నిరాహార దీక్షకు ముందే స్టేటస్ రిపోర్ట్ ను తీసుకొని కేబినెట్ సబ్ కమిటీకి ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →