- BIKKI NEWS : 21-01-2026
RYTHU BHAROSA AMOUNT WILL CREDIT AFTER MUNICIPAL ELECTIONS. రైతు భరోసా యాసంగి సీజన్ 2026 కు సంబంధించిన నిధులు రైతుల ఖాతాల్లోకి మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత జమ చేసే అవకాశం ఉంది.
RYTHU BHAROSA AMOUNT WILL CREDIT AFTER MUNICIPAL ELECTIONS
ఈ నెలలోనే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం మెండుగా ఉంది. అలాగే ఫిబ్రవరి రెండో వారంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం మేడారంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా రైతు భరోసా నిధుల జమపై ఎలాంటి ప్రకటన ప్రభుత్వం చేయలేదు. దీంతో రైతు భరోసా నిధులు జమ ఆలస్యమయ్యే అవకాశం ఉంది.
శాటిలైట్ సర్వే తర్వాతే రైతు భరోసా
అలాగే వ్యవసాయ శాఖ పంట భూములను గుర్తించేందుకు శాటిలైట్ సర్వే ను చేపట్టింది. కేవలం సాగు భూములకే రైతు భరోసా పథకం అమలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. సాగు చేయని భూములు, నాలా కన్వర్షన్ భూములు, కొండలు, గుట్టలకు రైతు భరోసా నిలిపివేయాలని ప్రాథమికంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అలాగే ఉద్యోగులకు, ఆదాయపన్ను చెల్లింపుదారులకు కూడా రైతు భరోసా పథకం నిలిపివేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
ఎకరాల పై సీలింగ్ అవకాశం
అలాగే ఎన్ని ఎకరాలలకు ఇవ్వాలనే దానిపై కూడా ప్రభుత్వం తర్జనభర్జన పడుతుంది. గతేడాది నిర్వహించిన రైతు సదస్సులో కూడా రైతు భరోసా 5 లేదా 7 లేదా 10 ఎకరాల వరకు ఉన్న రైతులకే ఈ పథకాన్ని అమలు చేయాలనే డిమాండ్ వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
- CUET UG 2026 RESULTS కోసం క్లిక్ చేయండి
- JL to Principal promotions – మరో 19 మంది జేఎల్స్ కు పదోన్నతి
- Telangana PRC 2026- త్వరలోనే పీఆర్సీ నివేదిక సమర్పణ
- BR Ambedkar open University admissions 2026 – అంబేద్కర్ వర్షిటీ డిగ్రీ , పీజీ ప్రవేశాలు
- Employees Life Insurance Scheme- తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ వరం.. రూ.1.20 కోట్ల ఉచిత జీవిత బీమా పథకం

