BIKKI NEWS (OCT. 13) : NR CORRECTION OF INTERMEDIATE STUDENTS. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు విద్యార్థుల NR ఉన్న తప్పిదాలను కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది. మొదటి మరియు రెండవ సంవత్సరం విద్యార్థుల వివరాలను కూడా అప్డేట్ చేసుకోవచ్చు.
NR CORRECTION OF INTERMEDIATE STUDENTS
విద్యార్థుల ఎన్.ఆర్ లోని వివరాలను కరెక్షన్ చేయడానికి గడువు అక్టోబర్ 17 వరకు కలదు.
విద్యార్థుల యొక్క వివిధ వివరాల్లో దొర్లిన తప్పులను కరెక్షన్ చేసుకోవడానికి కళాశాల లాగిన్ ద్వారా నిర్దేశిత రుసుముతో అవకాశం కల్పించింది.
కళాశాల ప్రిన్సిపాల్ లు డి ఐ ఈ ఓ ద్వారా ఇంటర్మీడియట్ బోర్డు కు ఈ వివరాలను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
NR లో ఉన్న వివరాలే విద్యార్థుల హాల్ టికెట్లు, మార్కుల మెమోలు, పాస్ సర్టిఫికెట్ల యందు వస్తాయి. కనుక జాగ్రత్తగా పదో తరగతి మెమో ఆధారంగా వివరాలను చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.
క్యాస్ట్, జెండర్, పుట్టిన తేదీ, పోటోలలోని తప్పిదాలను పూర్తి ఉచితంగా ఫస్టీయర్, సెకండీయర్ విద్యార్థులకు కరెక్షన్ చేయవచ్చు.
పేరు కరెక్షన్ (As per SSC) : 1,000/- (ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు)
సెకండ్ లాంగ్వేజ్ మార్పు : 2,000/- (ఫస్టీయర్)
లాంగ్వేజ్ మార్పు : 2,000/- (ఫస్టీయర్)
గ్రూప్ మార్పు : 5,000/- (ఫస్టీయర్, సెకండీయర్ విద్యార్థులకు అవకాశం కలదు. కేవలం హ్యుమానిటీస్ గ్రూప్ లోకి మాత్రమే)
- Telangana Anganwadi jobs Vacancies 2026 – నోటిఫికేషన్ లు షురూ, అర్హతలు, ఖాళీల వివరాలు
- Today Gold Rate June 21st 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- Today Gold Rate June 20th 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- Standard GK bits in Telugu 152 – జనరల్ నాలెడ్జ్ బిట్స్
- Free bus journey – నీట్ విద్యార్థులకు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం

