BIKKI NEWS (MAY 12) : NEET 2026 paper leak news. నీట్ 2026 పేపర్ లీకైనట్లు వస్తున్న వార్తలు వేసిన వ్యాప్తంగా కలకలం రేపాయి. రాజస్థాన్ లోని సికార్ పరీక్ష కేంద్రంలో పరీక్ష రాసే విద్యార్థులకు ముందుగానే ప్రత్యేక మెటీరియల్ అందినట్లు అందులోని అన్ని ప్రశ్నలు నీట్ పరీక్షలో వచ్చినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. దీనిపై రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ ప్రత్యేక దర్యాప్తు ను చేపట్టింది.
NEET 2026 paper leak news.
ఈ పేపర్ లీక్ వార్తలపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కూడా స్పందించింది. పరీక్ష జరిగిన నాలుగు రోజుల తర్వాత పేపర్ లీక్ వార్తలు తమ దృష్టికి వచ్చినట్లు, అప్పటినుండి దర్యాప్తు సంస్థలకు సహకరిస్తున్నామని, తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. అలాగే పరీక్షను ప్రోటోకాల్ ప్రకారమే నిర్వహించమని స్పష్టం చేసింది.
రాజస్థాన్సి లోని సికార్ పరీక్షా కేంద్రంలో పరీక్ష రాసిన విద్యార్థుల వాట్సాప్ లకు 42 గంటల ముందే ఈ పేపర్ అందినట్లు తెలుస్తోంది. దీనికోసం విద్యార్థుల నుండి 20 వేల నుండి రెండు లక్షల వరకు వసూలు చేసినట్లు కూడా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.
మే 3న దేశవ్యాప్తంగా దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు నీట్ ప్రవేశ పరీక్షకు హాజరైనట్లు సమాచారం. జాతీయస్థాయిలో ఎంబిబిఎస్, బిడిఎస్ ఇతర విద్య కోర్సుల్లో ప్రవేశం కోసం ఈ పరీక్షను నిర్వహిస్తారు. దేశంలో నిర్వహించే అతిపెద్ద ప్రవేశ పరీక్ష ఇదే కావడం గమనార్హం.
గత ఏడాది కూడా నీటి ప్రవేశ పరీక్ష రాసిన కొంతమంది విద్యార్థులకు అదనంగా మార్కులు కలపడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ విషయం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది.

