INDIAN COURTS – భారత దేశంలోని కోర్టుల రకాలు.

Courts and types

BIKKI NEWS : INDIAN COURTS AND IT’S TYPES. భారత ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యానికి నాలుగు స్తంభాలలో ముఖ్యమైన మూల స్తంభం న్యాయ వ్యవస్థ.

INDIAN COURTS AND IT’S TYPES

న్యాయవ్యవస్థలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. రాష్ట్రస్థాయిలో అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు .

ప్రజలకు సత్వర న్యాయం కోసం న్యాయ వ్యవస్థ వివిధ స్థాయిలలో కోర్టులను ఏర్పాటు చేసింది. భారత్ న్యాయవ్యవస్థ నిర్మాణం, కోర్టుల రకాలను పోటీ పరీక్షలు నేపథ్యంలో అందించడం జరిగింది.

సుప్రీంకోర్టు (దేశ అత్యున్నత న్యాయస్థానం)

హైకోర్టు (రాష్ట్రాల అత్యున్నత న్యాయస్థానం)

హైకోర్టు పరిధి లో మరల రెండు రకాల స్థాయిలలో కోర్టులు ఉంటాయి.

  • మెట్రోపాలిటన్ కోర్టు
  • డిస్ట్రిక్ట్ కోర్టు

మెట్రోపాలిటన్ కోర్టు పరిధిలో మరల మూడు స్థాయిల్లో కోర్టులు ఉంటాయి. అవి

  • మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు
  • సిటీ సివిల్ & సెషన్స్ కోర్టు
  • ప్రెసిడెన్సీ స్మాల్ కాజ్ కోర్టు

అలాగే డిస్ట్రిక్ట్ కోర్టు పరిధిలో మరల మూడు స్థాయిల్లో కోర్టులు ఉంటాయి. అవి.

  • సివిల్ సబార్డినేట్ జడ్జి కోర్టు
  • ప్రావిన్సియల్ స్మాల్ కాజ్ కోర్టు
  • క్రిమినల్ – కోర్టు ఆఫ్ సెషన్

మరల సివిల్ సబార్డినేట్ జడ్జి కోర్టు పరిధిలో రెండు స్థానాల్లో కోర్టులు ఉంటాయి. అవి.

  • మన్సిఫ్స్ కోర్టు
  • న్యాయ పంచాయతీ

అలాగే క్రిమినల్ – కోర్టు ఆఫ్ సెషన్
పరిధిలో రెండు స్థాయిల్లో కోర్టులు ఉంటాయి. అవి.

  • ఆధీన మెజిస్ట్రేట్ కోర్టు
  • పంచాయతీ, అదాలత్

ఆధీన మెజిస్ట్రేట్ కోర్టు పరిధిలో మరల రెండు స్థాయిలలో కోర్టులు ఉంటాయి. అవి.

  • జ్యుడీషియల్ మేజిస్ట్రేట్
  • ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్
Indian courts - భారత దేశంలోని కోర్టుల రకాలు.
INDIAN COURTS AND IT'S TYPES
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →