- 4 ప్రధాన డిమాండ్లపై స్పష్టత ఇవ్వని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
- రేపు అత్యవసర రాష్ట్ర విస్తృత స్థాయి TGEJAC సమావేశం
BIKKI NEWS (SEP. 23) : TGEJAC talks with Government Chief Secretary fail. ఉద్యోగ, ఉపాధ్యాయు గెజిటెడ్ పెన్షనర్ కార్మికసమస్యల పరిష్కారం కోసం TGEJAC ప్రతిపాదించిన నాలుగు ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సంజయ్ జాజూ గారితో నేడు సచివాలయంలో జరిగిన చర్చలు ఎలాంటి స్పష్టమైన నిర్ణయం లేకుండానే ముగిశాయని TGEJAC చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస్ రావు తెలిపారు.
TGEJAC talks with Government Chief Secretary fail
గత మే 2న గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ TGEJAC సెప్టెంబర్ 10న తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హామీ మేరకు వాయిదా వేసిన విషయం తెలిసిందే. అనంతరం గత రెండు రోజులుగా సమావేశం వాయిదా పడుతూ, చివరకు నేడు సచివాలయంలో సమావేశం జరిగింది.
అయితే, TGEJAC ప్రధానంగా లేవనెత్తిన నాలుగు డిమాండ్లలో ఏ ఒక్క అంశంపైనా నేడు స్పష్టమైన కాలపరిమితితో కూడిన నిర్ణయం వెలువడలేదని TGEJAC నాయకులు తెలిపారు. సమావేశం జరిగిన తీరు పై TGEJAC తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది
సమావేశంలో ప్రధాన కార్యదర్శి వెల్లడించిన అంశాలు:
DA: దసరాకు ఒక DA, ఉగాదికి మరో DA ఇస్తామని, అయితే దీనిని కేబినెట్‌కు తాము కేవలం ప్రతిపాదిస్తామని ప్రధాన కార్యదర్శి తెలిపారు.
పెండింగ్ బిల్లులు: నెలకు గతంలో లాగ ₹2,000 కోట్ల విలువైన పెండింగ్ బిల్లులు చెల్లించాలని TGEJAC కోరగా, నెలకు ప్రస్తుతం చెల్లిస్తున్న సుమారు ₹1,000 కోట్ల మేర మాత్రమే చెల్లింపులు చేయగలమని ప్రభుత్వం తెలిపింది.
PRC: PRC నివేదిక ఈ రోజు వరకు తెప్పించకుండా ఒకటి లేదా రెండు నెలల్లో వచ్చే అవకాశం ఉందని, అనంతరం రాజకీయ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం దాట వేసే ప్రయత్నం చేసింది
CPS: CPSపై కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పినప్పటికీ, కమిటీ ఏర్పాటుకు లేదా నివేదికకు ఎలాంటి కాలపరిమితిని వెల్లడించలేదు. మరియు కమిటీని ఏర్పాటు చేయలేదు ముఖ్యంగా 01-09-2004 నాటికి నియమితులైన ఉద్యోగుల విషయంలో కూడా స్పష్టత ఇవ్వలేదు.
ఈ అంశాలపై నేడు జరిగిన సమావేశంలో స్పష్టమైన నిర్ణయం, లేదా కాలపరిమితి లేకపోవడంతో ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలమైనట్లుగా భావిస్తున్నామని TGEJAC చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస్ రావు తెలిపారు.
వీటి పైన తదుపరి కార్యాచరణ పై TGEJAC నిర్ణయం తీసుకోనుంది. దీనిపై చర్చించేందుకు రేపు TGEJAC ఆధ్వర్యంలో అన్ని అనుబంధ సంఘాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో రాష్ట్ర స్థాయి అత్యవసర విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు వారు తెలిపారు.
ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం జరిగే వరకు ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమాన్ని కొనసాగిస్తామని TGEJAC నాయకులు స్పష్టం చేశారు.

