Harappa and mohenjodaro civilizations important facts

Harappa and Mohenjodaro Civilizations important facts – హరప్పా, మొహంజదారో నాగరికతలు

BIKKI NEWS : Harappa and Mohenjodaro Civilizations important facts. భూమి మీద అతి పురాతన నాగరికతలు 1921 నాటి పురావస్తు శాస్త్రవేత్తల తవ్వకాలలో భారత ఉపఖండంలో రావి, సింధూ నది పరివాహకాలలో హరప్పా, మొహంజోదారో నాగరికతలు బయల్పడ్డాయి…‌(జనరల్ స్టడీస్)

Harappa and Mohenjodaro Civilizations important facts

అక్కడ లభించిన వస్తువులను బట్టి అప్పట్లోనే పట్టణ నాగరికత ఎంతో అబివృద్ది చెందినదని చెప్పవచ్చు. అప్పటి ముఖ్య పట్టణాల గురించి తెలుసుకుందాం…

హరప్పా :- (1921)
శాస్త్రవేత్త : దయారాం సహానీ
రాష్ట్రం : పంజాబ్ (పాకిస్థాన్)
నది : రావి నది
విశేషాలు :

  • ధాన్యాగారాలు,
  • శవపేటిక,
  • కాంస్యంతో చేసిన ఎడ్లబండ్లు,
  • ‘H’ ఆకారం శ్మశాన వాటిక.

మొహంజోదారో :- (1922)
శాస్త్రవేత్త : ఆర్.డి. బెనర్జీ
రాష్ట్రం : సింధ్ (పాకిస్తాన్)
నది : సింధు నది
విశేషాలు :

  • మహాధాన్యాగారం,
  • మహా స్నానవాటిక,
  • మెసపటోమియాకు చెందిన మూడు స్థూపాకార ముద్రికలు,
  • కాంస్య నాట్యగత్తె విగ్రహం,
  • స్టీటైట్ తో తయారుచేసిన గడ్డపు మనిషి

చన్హుదారో :- (1931)
శాస్త్రవేత్త : ఎం.జి. మజుందార్
నది : సింధు నది.
రాష్ట్రం : సింధ్ (పాకిస్తాన్)
విశేషాలు :

  • కోట లేని ఏకైక నగరం,
  • గవ్వలు, పూసలతో ఆభరణాలు తయారయ్యే పరిశ్రమలు,
  • పిల్లికి సంబంధించిన ఆధారాలు.

లోథాల్ :- (1955 )
శాస్త్రవేత్త : ఎస్.ఆర్. రావు
నది : భోగావో
రాష్ట్రం : గుజరాత్
ముఖ్య విశేషాలు
 ::

  • రేవు పట్టణం,
  • నౌకా నిర్మాణ కేంద్రం,
  • ఒకే సమాధిలో జంట శవాలు,
  • వరి గింజ,
  • టెర్రా కోట గుర్రపు బొమ్మ

కాళీ బంగన్ :- (1961)
శాస్ర్తవేత్తలు : బి.బి. లాల్, బి.కె, థాపర్
రాష్ట్రం : రాజస్థాన్
నది : ఘగ్గర్ (సరస్వతి)
ముఖ్య విశేషాలు ::

  • ఒక వరుసలో ఏడు హోమగుండాలు,
  • నాగలి గుర్తులున్న వ్యవసాయ భూమి,
  • సర్పిలాకార బొమ్మల లిపి.

ధోలవీర :- (1991)
శాస్ర్తవేత్తలు : జె.పి. జోషి ఆర్.ఎస్. బిస్త్
రాష్ట్రం : గుజరాత్
నది : నది లేదు
ముఖ్య విశేషాలు ::

  • స్టేడియం,
  • రిజర్వాయర్,
  • భారతదేశంలో ఉన్న సింధు నగరాల్లో అత్యంత విశాలమైంది.
Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →