Free foundation coaching by sc study circle 2026

FREE COACHING – ప్రభుత్వ ఉద్యోగాలకు ఉచిత వసతి, శిక్షణ

BIKKI NEWS (JAN. 09) : FREE FOUNDATION COACHING BY SC STUDY CIRCLE 2026. తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ 2025-26 కాలంలో బ్యాంకింగ్, RRB మరియు SSC తో సహా వివిధ రాష్ట్ర ప్రభుత్వ మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కొరకు 5 నెలల ఫౌండేషన్ కోర్సు కొరకు ఉచిత కోచింగ్ కొరకు ప్రకటన విడుదల చేసింది.

FREE FOUNDATION COACHING BY SC STUDY CIRCLE 2026

TGSC స్టడీ సర్కిల్, హైదరాబాద్, అన్ని (12) TGSC స్టడీ సర్కిల్ జిల్లా బ్రాంచ్లు ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్ధిపేట్, సూర్యాపేట్ మరియు వరంగల్ జిల్లాలలో ప్రతీ ప్రదేశం వద్ద SC, ST, BC (ఈ కేటగిరీల నుండి BC-E మరియు PwDతో సహ)కు చెందిన 100 అభ్యర్థుల చొప్పున శిక్షణ ఇవ్వనున్నారు.

2025-26 సంవత్సరానికి బ్యాంకింగ్ RRB మరియు SSC తో సహా వివిధ రాష్ట్ర ప్రభుత్వ మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కొరకు (5) నెలల ఫౌండేషన్ కోర్సు కొరకు 20-02-2026 నుండి 19-07-2026 వరకు. ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ ను నిర్వహిస్తున్నది.

దీని కొరకు 09-01-2026 నుండి తెలంగాణలోని (33) జిల్లాలకు చెందిన అర్హతగల (ఏదైనా డిగ్రీ అర్హత మరియు కుటుంబ ఆదాయం 3.00 లక్షలకు తక్కువగా ఉండాలి) అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు కోరబడుచున్నవి.

ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: 30-01-2026.

ఎంట్రన్స్ పరీక్ష తేది పైన తెలిపిన (12) జిల్లా హెడ్ క్వార్టర్స్ వద్ద 08-02-2026న ఉ.11.00 గం. మరియు మ.1.00గం. మధ్య నిర్వహించుటకు షెడ్యూల్ చేయబడినది.

12 జిల్లా బ్రాంచ్లలో దేనిలోనైనా రెగ్యులర్ (5)నెలల ఫౌండేషన్ కోర్సు కొరకు మరియు స్టేట్ స్టడీ సర్కిల్, హైదరాబాద్ వద్ద సివిల్ సర్వీసుల కొరకు గతంలో కోచింగ్
వినియోగించుకున్న అభ్యర్థులు ఈ కోర్సు కొరకు దరఖాస్తు చేయుటకు అర్హులుకారు.

పూర్తి వివరాలు కోసం కింద ఇవ్వబడిన వెబ్సైట్ ను సందర్శించండి. మరియు 040-23546552 మరియు 8121626423 ఏవైనా విచారణల కొరకు tsscscexams@gmail.com. కు మెయిల్ చేయవలెను.

వెబ్సైట్ http://tsstudycircle.co.in/
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →