BIKKI NEWS (APRIL 26) : FREE BANKING COACHING BY TELANGANA STUDY CIRCLE 2026. వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఉద్యోగాల భర్తీ కోసం ఐబీపీఎస్ నిర్వహించే పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వడానికి తెలంగాణ గిరిజన స్టడీ సర్కిల్ ప్రకటన విడుదల చేసింది.
FREE BANKING COACHING BY TELANGANA STUDY CIRCLE 2026
హైదరాబాదులోని పిఈటిసి శిక్షణ కేంద్రంలో 100 రోజుల పాటు ఉచిత శిక్షణ, వసతిని గిరిజన స్టడీ సర్కిల్ కల్పించనుంది.
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు కింద ఇవ్వబడిన అధికారిక వెబ్సైట్ లింకు ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతలు : డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం 3 లక్షల లోపు ఉండాలి. ఇంతకుముందు ఉచిత శిక్షణ పొందిన అభ్యర్థులు అర్హులు కాదు.
దరఖాస్తు విధానం, గడువు : ఆన్లైన్ ద్వారా ఏప్రిల్ 28 నుండి మే 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
శిక్షణ ప్రారంభం : 2026 మే 20 నుండి శిక్షణ ప్రారంభమవుతుంది. వంద రోజులపాటు ఉచిత శిక్షణ అందించనున్నారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో ఎస్టీలకు 75 సీట్లు, ఎస్సీలకు 15 సీట్లు, బీసీలకు 10 సీట్ల చొప్పున కేటాయించనున్నారు.
ఈ నోటిఫికేషన్ గురించి మరింత సమాచారం కోసం ఈ నెంబర్ 040 – 27540104 లో పని వేళల్లో సంప్రదించవచ్చు.
OFFICIAL WEBSITE LINK
