GJC Girls Husnabad లో మత్తు పదార్థాల, మాదకద్రవ్యాల నిర్మూలన ప్రతిజ్ఞ.

Gjc girls husnabad


BIKKI NEWS (SEP. 28) : GJC Girls Husnabad anti drug programme. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల హుస్నాబాద్ లో కళాశాల ప్రిన్సిపాల్,అధ్యాపక మరియు అధ్యాపకేతర బృందం విద్యార్థినిలు మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మత్తు పదార్థాలు మరియు మాదాక.ద్రవ్యాలకు దూరంగా ఉంటూ సమాజంలో మత్తు పదార్థాలకు మరియు మాదకద్రవ్యాలకు నిర్మలకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయడం జరిగింది.

GJC Girls Husnabad anti drug programme

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి వి. లలిత మాట్లాడుతూ… విద్యార్థినిలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి పట్టుదలతో చదివి లక్ష్యాన్ని సాధించాలన్నారు. విద్యార్థినిలు మాదకద్రవ్యాల నిర్మూలన గురించి సమాజంలోని పౌరులందరికీ అవగాహన కల్పించాలన్నారు.

అనంతరం కళాశాల స్టూడెంట్ కౌన్సిలర్ మరియు మాదకద్రవ్యాల కన్వీనర్ శ్రీమతి టి నిర్మల దేవి మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నిర్మూలన గురించి తెలుపుతూ విద్యార్థినిలు మాదకద్రవ్యాల గురించి పూర్తి అవగాహనను కలిగి ఉండాలన్నారు .

ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి డి కరుణాకర్ మాట్లాడుతూ విద్యార్థినిలు మాదక ద్రవ్యాల నిర్మూలన గురించి సమాజంలో అవగాహన కల్పించాలని తెలుపుతూ సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం బి లక్ష్మయ్య , ఏ సంపత్, డి రవీందర్, S.సదానందం, కే స్వరూప, ఎస్ కవిత, జి కవిత, ఆస్మా పిర్దోస్, ఓ రాణి, జూనియర్ అసిస్టెంట్లు కే గీతాంజలి మరియు S. రాములు , రికార్డు అసిస్టెంట్ టి రమాదేవి ,విద్యార్థులు మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మొదలగు వారు పాల్గొన్నారు.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →