Local status – నాలుగేళ్లు చదివితేనే లోకల్ – సుప్రీంకోర్ట్

Telangana local status supreme court verdict.

BIKKI NEWS (Sep. 29) : Telangana local status supreme court verdict. తెలంగాణ‌ రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు స్థానిక రిజర్వేషన్ నిబంధనలపై సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది. స్థానిక అభ్యర్థిగా పరిగణించేందుకు సంబంధిత విద్యార్థి తెలంగాణలో వరుసగా నాలుగు విద్యా సంవత్సరాలు చదివి ఉండాలనే నిబంధనను అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది.

Telangana local status supreme court verdict.

తెలంగాణకు వర్తించే రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగానే విద్యార్థులు ఉందని సుప్రీంకోర్టు గత తీర్పులో స్పష్టం చేసింది.

తెలంగాణ మెడికల్, డెంటల్ కాలేజీల ప్రవేశ నిబంధనల ప్రకారం.. సంబంధిత అర్హత పరీక్షకు ముందు ముగిసే నాలుగు వరుస విద్యా సంవత్సరాల్లో (9, 10 & ఇంటర్మీడియట్ ) తెలంగాణలోని విద్యా సంస్థల్లో చదివిన అభ్యర్థిని స్థానిక అభ్యర్థిగా పరిగణిస్తారు. విద్యార్థి ఆ కాలంలో విద్యాసంస్థలో చదవకుండా తెలంగాణలో నివసించిన సందర్భంలోనూ ప్రత్యేక నిబంధనలు వర్తిస్తాయి. ఈ నిబంధనలకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 371డీ కింద జారీ చేసిన రాష్ట్రపతి ఉత్తర్వులే ఆధారం.

స్థానిక అభ్యర్థి నిర్వచనంపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిలు అప్పీళ్లపై సుప్రీంకోర్టు 2025 సెప్టెంబర్ లో తీర్పు ఇచ్చింది. రాష్ట్రం రూపొందించిన స్థానిక అభ్యర్థి నిబంధనలు రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. కేవలం తెలంగాణకు చెందిన వారమనే నేటివిటీ లేదా శాశ్వత నివాసం ఆధారంగా స్థానిక హోదా కల్పించాల్సిన అవసరం లేదని, విద్యాభ్యాసం, స్థానిక ప్రాంతంతో నిరంతర అనుబంధానికి నిబంధనలు ప్రాధాన్యం ఇస్తున్నాయని తీర్పులో వివరించింది.

స్థానిక రిజర్వేషన్ అంశం ప్రధానంగా తెలంగాణలోని ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి కోర్సుల్లో కాంపిటెంట్ అథారిటీ కోటా ప్రవేశాలకు సంబంధించినది. రాష్ట్రంలోని స్థానిక అభ్యర్థులకు వర్తించే రిజర్వేషన్ వ్యవస్థను రాష్ట్రపతి ఉత్తర్వుల పరిధిలోనే అమలు చేయాలన్న సుప్రీంకోర్టు వైఖరి ఈ తీర్పులతో మరోసారి స్పష్టమైంది.

Also Read…

• తాజా విద్యా సమాచారం
• తాజా జాబ్ నోటిఫికేషన్స్
• ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
• కరెంట్ అఫైర్స్
• జీకే బిట్స్
• ఎంప్లాయిస్ న్యూస్
Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →