Reliance Scholarship 2026 : 6 లక్షల స్కాలర్షిప్

Reliance scholarship 2026

BIKKI NEWS (Sep. 29) : Reliance scholarship 2026. మొదటి సంవత్సరం చదువుతున్న డిగ్రీ మరియు పీజీ విద్యార్థుల కొరకు రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్షిప్ అందజేయడానికి ప్రకటన విడుదల చేసింది.

Reliance scholarship 2026

దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు విద్యార్థుల ఆర్థిక పరిస్థితి, ఎడ్యుకేషనల్ మెరిట్ మరియు ఆన్లైన్ టెస్ట్ ద్వారా విద్యార్థులను ఎంపిక చేసి స్కాలర్షిప్లను అందజేస్తారు.

డిగ్రీ విద్యార్థులకు కోర్స్ మొత్తానికి కలిపి 2 లక్షల వరకు పీజీ విద్యార్థులకు కోర్సు మొత్తాన్ని కలిపి 6 లక్షల వరకు స్కాలర్షిప్ నగదును అందజేయనున్నారు.

డిగ్రీ విద్యార్థులు ఇంటర్మీడియట్లో 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. రెగ్యులర్ డిగ్రీ కోర్సులో అడ్మిషన్ పొంది ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం 15 లక్షల లోపు ఉండాలి.

పీజీ విద్యార్థుల డిగ్రీలో 7.5% CGPA కలిగి ఉండాలి లేదా గేట్ అర్హత సాధించి ఉండాలి. రెగ్యులర్ పీజీ కోర్సుల్లో అడ్మిషన్ పొంది ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం 15 లక్షలు లోపు ఉండాలి.

దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఆన్లైన్ ద్వారా 05 అక్టోబర్ 2026 వరకు కలదు.

వెబ్సైట్ : Reliance foundation

Also Read…

• తాజా విద్యా సమాచారం
• తాజా జాబ్ నోటిఫికేషన్స్
• ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
• కరెంట్ అఫైర్స్
• జీకే బిట్స్
• ఎంప్లాయిస్ న్యూస్
Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →