Da hike - ఆ ఉద్యోగులకు డీఏ 1. 621 పెంపు - bikki news

DA hike – ఆ ఉద్యోగులకు డీఏ 1.621 పెంపు

BIKKI NEWS (June 18) : DA hike for Telangana electricity department employees. తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు డీఏ పెంచుతూ ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. విద్యుత్ సంస్థల ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు 2026 జనవరి 1 నుంచి అమలులోకి వచ్చేలా డీఏను పెంచే ప్రతిపాదనకు డిప్యూటీ సీఎం ప‌చ్చ జెండా ఊపారు.

DA hike for Telangana electricity department employees

విద్యుత్ ఉద్యోగుల‌కు 1.621 శాతం మేర డీఏను పెంచుతూ ప్రభుత్వం నిర్ణ‌యం తీసుకుంది. దీనితో విద్యుత్ ఉద్యోగుల డీఏ 17.651% నుంచి 19.272% కి చేరిన‌ట్లు అయింది. ఈ డీఏ పెంపు వ‌ల్ల ప్ర‌భుత్వంపై నెలకు సుమారు రూ. 9.35 కోట్ల అదనపు ఆర్థిక భారం పడనుంది. విద్యుత్ రంగ సంస్థ‌ల్లో ప‌ని చేస్తున్న మొత్తం 70,804 మంది సిబ్బంది, పెన్షనర్లు ఈ డీఏ పెంపు వ‌ల్ల ప్రయోజనం పొందనున్నారు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →