Employees health scheme - జూన్ 1న సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష - bikki news

Employees health Scheme – జూన్ 1న సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష

BIKKI NEWS (may 31) : CM Revanth Reddy review meeting on employees health scheme on June 1st. తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు సంబంధించి ప్రభుత్వం అమల్లోకి తీసుకువస్తున్న ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలుకు సంబంధించి జూన్ 1వ తేదీన ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

CM Revanth Reddy review meeting on employees health scheme on June 1st.

ఎంప్లాయి హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ఈ పథకం అమలు కానుంది. ఈ పథకానికి సంబంధించి ఉద్యోగ సంఘాల నుంచి ఆరుగురు, పెన్షనర్ల నుంచి ఇద్దరు ప్రతినిధులు ఈ ట్రస్ట్ సభ్యులుగా ఉంటారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి ఒకరిని ఈ ట్రస్టుకు సీఈవోగా నియమిస్తారు. ఈ పథకం అమలుకు అవసరమైన వివరాల సేకరణ ఇప్పటికే ప్రారంభమైంది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యుల వివరాలను సేకరించేందుకు ఫైనాన్స్ శాఖ ఇప్పటికే అన్ని శాఖలకు సర్క్యులర్ జారీ చేసింది.

మే 31వ తేదీలోపు డేటా అప్‌లోడ్‌ చేయాలని స్పష్టం చేసింది. ఈ వివరాల ఆధారంగా డిజిటల్ హెల్త్ కార్డులు, క్యాష్‌లెస్ చికిత్స సేవలు అందించేలా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుంది.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →