Prc 2026 - త్వరలోనే పీఆర్సీ ప్రకటన - ఉద్యోగ సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి - bikki news

PRC 2026 – త్వరలోనే పీఆర్సీ ప్రకటన – ఉద్యోగ సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి

BIKKI NEWS (MAY 02) : CM Revanth Reddy on PRC 2026 implementation. ఈరోజు ఉద్యోగ సంఘాల నాయకులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భేటీ జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక హామీలను ఉద్యోగులకు ప్రకటించారు.

CM Revanth Reddy on PRC 2026 implementation

పీఆర్సీపై తక్షణమే రిపోర్టు అందించాలని అధికారుల కమిటీని ఆదేశించామని, రిపోర్టు ఆధారంగా పీఆర్సీపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఉద్యోగ సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రకటించినా ఉద్యోగులు భుజాన వేసుకుని పనిచేశారని, ఉద్యోగుల సహకారంతోనే ప్రభుత్వ సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేయగలుగుతున్నామని తెలిపారు.

మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగుల కోసమే మొదటి నిర్ణయం తీసుకున్నామని, ఉద్యోగులకు ప్రతీ నెలా మొదటి తారీఖున వేతనాలు అందేలా చర్యలు తీసుకున్నామని, ఉద్యోగ సంఘాలు స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించుకునేలా అవకాశం కల్పించామని గుర్తు చేశారు.

ఉద్యోగుల బదిలీల విషయంలో గందరగోళం తలెత్తకుండా ప్రణాళిక ప్రకారం నిర్వహించాంమని, ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న టీచర్ల బదిలీలు ఎలాంటి వివాదం లేకుండా పూర్తి చేశామని తెలిపారు.

ఉద్యోగుల ఆరోగ్య భద్రత కార్డుల ప్రతిపాదనపై కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, జూన్ 1 లోగా ఆరోగ్య భద్రత కార్డులను ఉద్యోగులకు అందిస్తామని స్పష్టం చేశారు.

వందరోజుల్లో ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం రూ. 6 వేల కోట్లు చెల్లిస్తామని, ఈ నిధులను ఖర్చు ప్రాధాన్యతల నిర్ణయం ఉద్యోగులదేనిని తెలిపారు.

ప్రతీ రెండు నెలలకోసారి గుర్తింపు సంఘాలు సమావేశమై సమస్యలపై ప్రభుత్వానికి రిపోర్టు అందించాలని తెలిపారు. ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం… మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత మాది అని తెలిపారు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →