Aedp courses - డిగ్రీతో పాటు అప్రెంటిస్ షిప్, సంపాదన - bikki news

AEDP COURSES – డిగ్రీతో పాటు అప్రెంటిస్ షిప్, సంపాదన

హైదరాబాద్ (ఏప్రిల్ 15) : Apprenticeship with degree study in Telangana by AEDP Courses. డిగ్రీ చదువుతూనే అప్రెంటిస్ చేయడం, కోర్సు పూర్తి కాగానే ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా అప్రెంటిస్ఆప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ కోర్సులను తెలంగాణ ఉన్నత విద్య మండలి ప్రారంభించింది. 2026 – 27 విద్యా సంవత్సరానికి దీనీని మరింతగా విస్తరిస్తూ నిర్ణయం తీసుకుంది..

Apprenticeship with degree study in Telangana by AEDP Courses

2026-27 నుండి కొత్తగా మరో 11 AEDP కోర్సులను ప్రవేశపెట్టేందుకు తాజాగా గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇప్పటివరకు 15 కోర్సులు మాత్రమే అందుబాటులో ఉండగా, తాజా నిర్ణయంతో మొత్తం కోర్సుల సంఖ్య 26కు చేరనుంది.

  • ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ,
  • అగ్రికల్చర్,
  • మేనేజ్మెంట్ అండ్ మీడియా,
  • హెల్త్
  • బీఎస్సీ డైరీ అండ్ పౌల్ట్రీ మేనేజ్మెంట్,
  • ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్, ఫుడ్ టెక్నాలజీ మేనేజ్మెంట్
  • బీఏ యానిమేషన్ అండ్ వీఎఫ్ఎక్స్,
  • బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ సర్వీసెస్,
  • బీఎస్సీ ఇమొబిలిటీ అండ్ బ్యాటరీ (ఎలక్ట్రిక్ వాహనాల రంగం),
  • బీఎస్సీ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ హార్డ్వేర్,
  • బీఎస్సీ హార్టికల్చర్ అండ్ ల్యాండ్ స్కేపింగ్,
  • బీఎస్సీ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్,
  • బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ మేనేజ్ మెంట్,
  • బీకామ్ బిజినెస్ అనలిటిక్స్,
  • బీఏ ఫిల్మ్ అండ్ టీవీ ప్రొడక్షన్,
  • బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్

ఈ కొత్త కోర్సుల రాకతో ఏఈడీపీ విభాగంలో సీట్ల సంఖ్య 11,280కి పెంచాలని అధికారులు నిర్ణయించారు. DOST 2026 నోటిఫికేషన్ విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా ఈ కోర్సులలో సీట్లు పొందవచ్చు.

ఏఈడీపీ కోర్సుల అసలు ఉద్దేశం విద్యార్థులను నిరుద్యోగులుగా మిగల్చకుండా చూడటమే. డిగ్రీలు పూర్తి చేసిన వారు స్కిల్స్ లేక ఉద్యోగాల కోసం తిప్పలు పడుతుంటే, ఈ కోర్సుల్లో చేరినవారు కంపెనీల్లో అప్రెంటిస్ షిప్ పూర్తి చేస్తారు. థియరీతోపాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండటంతో కోర్సు పూర్తి కాగానే సదరు కంపెనీలే వీరిని పర్మనెంట్ ఉద్యోగిగా తీసుకుంటాయి.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →