- BIKKI NEWS : 23-01-2026
MJP DEGREE GURUKULA ADMISSIONS 2026. తెలంగాణ రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల (BC) విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించే లక్ష్యంతో మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (MJPTBCWREIS) కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గానూ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది.
MJP DEGREE GURUKULA ADMISSIONS 2026
ప్రవేశ ప్రక్రియ మరియు అర్హతలు (Admission Process)
గురుకుల డిగ్రీ నోటిఫికేషన్-2026: అడ్మిషన్లు పూర్తిగా ప్రవేశ పరీక్ష (Entrance Test) లేదా నోటిఫికేషన్ మెరిట్ ఆధారంగా జరుగుతాయి.
అర్హత: ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన వారు అర్హులు.
ఆదాయ పరిమితి: వార్షిక ఆదాయం ₹1,50,000 మించకూడదు.
రిజర్వేషన్: బీసీ విద్యార్థులకు 75% కేటాయింపులు ఉంటాయి. మెరిట్ మరియు సీట్ల లభ్యతను బట్టి ఎంపిక ఉంటుంది.
DOST రిజిస్ట్రేషన్: అడ్మిషన్ పొందేందుకు ‘DOST’ రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
Table of Contents
విద్యార్థులకు లభించే ప్రయోజనాలు (Student Benefits)
ఈ గురుకుల కళాశాలల్లో చేరడం వల్ల విద్యార్థినులకు అనేక ఉచిత సదుపాయాలు లభిస్తాయి:
పూర్తి ఉచిత విద్య: అడ్మిషన్ ఫీజు, ట్యూషన్ ఫీజు లేదు.
వసతి & భోజనం: నాణ్యమైన భోజనంతో పాటు ఉచిత వసతి సౌకర్యం.
యూనిఫాం: మూడు జతల యూనిఫాం, షూస్, బెడ్ షీట్స్, ట్రాక్ సూట్ అందిస్తారు.
అకడమిక్ సపోర్ట్: నోట్ బుక్స్, సైన్స్ రికార్డ్స్ ఉచితంగా పంపిణీ చేస్తారు.
నైపుణ్యాభివృద్ధి: సాఫ్ట్ స్కిల్స్, కంప్యూటర్ ట్రైనింగ్ మరియు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ (UPSC, TSPSC) కోసం శిక్షణ.
ఉద్యోగ అవకాశాలు: టాస్క్ (TASK), కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ వంటి ప్రముఖ కంపెనీల ద్వారా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్.
మహిళా డిగ్రీ కళాశాలలు (Degree Colleges for Women):
తెలంగాణలోని కింది ప్రాంతాల్లో మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు అందుబాటులో ఉన్నాయి: వర్గల్, (సిద్దిపేట) సంగారెడ్డి, హైదరాబాద్మే మేడ్చల్ మల్కాజ్‌గిరి నిజామాబాద్, ఖమ్మం స్టేషన్ ఘన్‌పూర్ (జనగామ) వనపర్తి, జోగులాంబ గద్వాల, భన్వాడ, కరీంనగర్, మహబూబాబాద్, ఆసిఫాబాద్, సూర్యాపేట, ఆదిలాబాద్, పెద్దపల్లి, ములుగు
పురుషుల డిగ్రీ కళాశాలలు (Degree Colleges for Men)
తెలంగాణలో పురుషుల కోసం కేటాయించిన డిగ్రీ కళాశాలలు: ఎల్లారెడ్డిపేట, ధర్మపురి, పాలకుర్తి, భువనగిరి, కందుకూరు, నాగార్జున సాగర్ ,దేవరకద్ర, మెదక్, నారాయణపేట, నాగర్ కర్నూల్, వికారాబాద్, మంచిర్చెయాల , భుపాలపల్లి,
ప్రొఫెషనల్ కళాశాలల జాబితా (Professional Colleges List) :
ప్రత్యేకంగా పేర్కొన్న ప్రొఫెషనల్ కోర్సులు మరియు కళాశాలలు:
ప్రొఫెషనల్ కళాశాలల జాబితా (Professional Colleges List)
| క్రమసంఖ్య | కళాశాల రకం / కోర్సు | ప్రాంతం (Location) |
|---|---|---|
| 1 | B.Sc. (Hons) Agriculture (4 ఏళ్ల కోర్సు – మహిళలకు) | కరీంనగర్, వనపర్తి |
| 2 | MJPR Law Colleges (B.A., LL.B., LL.B.) | హన్మకొండ, కందుకూరు (మహిళలు & పురుషులు) |
| 3 | BHMCT (Hotel Management) (కో-ఎడ్యుకేషన్) | సంగారెడ్డి |
| 4 | MJPR Fine Arts College (కో-ఎడ్యుకేషన్) | వికారాబాద్ (చేవెళ్ల వద్ద) |
వెబ్సైట్ : https://mjptbcwreis.telangana.gov.in/
- Today current affairs in Telugu May 12th 2026 – కరెంట్ అఫైర్స్
- Daily current affairs in Telugu May 11th 2026 – కరెంట్ అఫైర్స్
- Top current affairs 10th May 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Today Gold Rate June 14th 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- TG ICET 2026 Results విడుదల, ర్యాంక్ కార్డు కోసం క్లిక్ చేయండి

