BIKKI NEWS (JAN. 09) : Student Councellors compulsory in every educational institutions GO released. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి విద్యా సంస్థ కోచింగ్ సెంటర్లు తో సహా స్టూడెంట్ కౌన్సిలర్లను నియమించుకోవాల్సిందేనని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Student Councellors compulsory in every educational institutions GO released
ప్రభుత్వ, ప్రైవేటు, కార్పోరేట్, కోచింగ్ సెంటర్లు, హస్టల్ నిర్వాహకులతో సహా అన్ని విద్యాసంస్థలు 100 మంది విద్యార్థులు దాటి ఉంటే స్టూడెంట్ కౌన్సిలర్లను నియమించుకోవాల్సిందేనని ఉత్తర్వులలో స్పష్టం చేసింది.
ప్రభుత్వాలు స్టేట్ హెల్త్ పాలసీని రూపొందించుకోవాలని సుప్రీంకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 1 ని విడుదల చేసింది.
విద్యార్థుల్లో మానసిక ఆందోళనలు, ఆత్మహత్యలు నివారణే లక్ష్యంగా విద్యాసంస్థలు తగు చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులలో స్పష్టం చేశారు.
మార్గదర్శకాలు ఇవే…
ప్రతి విద్యా సంస్థ స్టూడెంట్ కౌన్సిలర్లను, మానసిక నిపుణులు నియమించుకోవాల్సి ఉంటుంది.
మార్కులు ర్యాంకులు ఆధారంగా విద్యార్థులను గ్రేడులుగా విభజించకూడదు
ఆత్మహత్యలు నివారణ కోసం టోల్ ఫ్రీ నెంబర్లు తెలియ మానస వంటి సేవలను వినియోగించుకోవాలి
విద్యార్థుల మానసిక పరిస్థితిపై ఎప్పటికప్పుడు తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి
విద్యార్థుల కోసం మానసిక ఆరోగ్య కార్యక్రమాలను రూపొందించుకొని వాటిని నిర్వహించాలి
క్రీడలు వంటి విద్యయేతర అంశాలను విద్యాసంస్థల్లో నిర్వహించాలి
మానసిక సమస్యలను గుర్తించేందుకు టీచింగ్ , నాన్ టీచింగ్ సిబ్బందికి శిక్షణ ఇప్పించాలి
హాస్టల్లో విద్యాసంస్థల్లో ట్యాంపర్ ప్రూఫ్ ఫ్యాన్లను బిగించాలి. విద్యార్థులు బిల్డింగ్ లో పైకి ఎక్కకుండా ఐరన్ గ్రిల్స్ ఏర్పాటు చేసుకోవాలి, బాల్కనీలకు కూడా ఐరన్ గ్రిల్స్ ఏర్పాటు చేసుకోవాలి

