TEP – తెలంగాణ విద్యా విధానం రూపకల్పనకు కమిటీ

Tep - తెలంగాణ విద్యా విధానం రూపకల్పనకు కమిటీ - bikki news

BIKKI NEWS (SEP. 01) : comittee on Telangana Education Policy. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం “తెలంగాణ రైజింగ్‌ 2047” మార్గదర్శక పత్రం కింద తెలంగాణ విద్యా విధానం (TEP) రూపకల్పనకు కమిటీని ఏర్పాటు చేసింది.

comittee on Telangana Education Policy.

ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ పాఠశాల విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ కమిటీకి ప్రభుత్వ సలహాదారు డా. కేశవరావు అధ్యక్షత వహించనున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ ఐఏఎస్ అధికారి అకునూరి మురళి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. రామకృష్ణారావు, విద్యాశాఖ కార్యదర్శి డా. యోగిత రాణా (కన్వీనర్‌), టిజీహెక్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ బాల కిష్టారెడ్డి సభ్యులుగా నియమితులయ్యారు.

ఈ కమిటీ జాతీయ విద్యా విధానం 2020లోని అంశాలను తెలంగాణ సందర్భానుసారంగా మార్చి పరిశీలించనుంది. అలాగే కొత్త ఉద్యోగావకాశాలు, నైపుణ్యాలు, ప్రపంచ మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థను సమన్వయం చేయడం, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌, ఇన్నోవేషన్‌, ఆంత్రప్రెన్యూర్షిప్‌ అంశాలపై దృష్టి సారించనుంది.

ఇకపోతే పాఠశాల, ఉన్నత, సాంకేతిక, వృత్తి, నైపుణ్య మరియు వృత్తిపరమైన విద్యా రంగాల్లో సమగ్ర సంస్కరణలను సూచించనుంది. పరిశోధన, పరిశ్రమలతో విద్యా రంగం అనుసంధానంపై సలహాలు ఇవ్వనుంది.

ఈ కమిటీ తమ నివేదికను 2025 అక్టోబర్‌ 30లోపు ప్రభుత్వానికి సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →