త్వరలోనే డిగ్రీ లెక్చరర్ల కొత్త నోటిఫికేషన్ - tgpsc - bikki news

త్వరలోనే డిగ్రీ లెక్చరర్ల కొత్త నోటిఫికేషన్ – TGPSC

BIKKI NEWS (Sep. 12) : TGPSC degree lecturers notification soon. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఖాళీల భర్తీకి 2022లో ఇచ్చిన నోటిఫికేషన్ ను టీజీపీఎస్సీ రద్దు చేసింది. కొత్త రోస్టర్, నిబంధనలకు అనుగుణంగా ఈ వారంలోనే కొత్త నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

TGPSC degree lecturers notification soon

డిగ్రీ లెక్చరర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్లకు సంబంధించి 544 పోస్టుల భర్తీకి 2022లో 33/2022 బ్రీఫ్ నోటిఫికేషన్ ఇచ్చారు. దీనిపై తాజా కమిషన్ సమగ్రంగా చర్చించి నోటిఫికేషన్ ను పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయించింది.

33/2022 నోటిఫికేషన్ తక్షణమే రద్దయిందని, అభ్యర్థులు ఈ మార్పును గమనించాలని టీజీపీఎస్సీ కార్యదర్శి హరిత తెలిపారు.

నూతన ఖాళీలతో మరో నోటిఫికేషన్ ను ఈ వారమే జారీ చేయనున్నారు.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →